జగన్ కోసమే అంబటి రాయుడు ప్రాక్టీస్

జగన్ కోసమే అంబటి రాయుడు ప్రాక్టీస్

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడో లేదో..వెంటనే తన సొంత జిల్లాలో వాలిపోయాడు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయముండగానే..ఇప్పటి నుంచే తనకు గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ప్రజానాడి తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. గుట్టుచప్పుడు కాకుండా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నాడు. అయితే, ముట్లూరులో కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా విగ్రహం దగ్గర… రాయుడు దిగిన ఒక ఫొటో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా వెల్లలూరు. బలమైన కాపు కమ్యూనిటీకి చెందిన అంబటి రాయుడు కుటుంబానికి మంచి పేరు ఉంది. గతంలో రాయుడు తాత గ్రామ సర్పంచ్ గానూ పనిచేశారు. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకే, జగన్ అంబటిని పొలిటికల్ గ్రౌండ్ లోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపుల విశ్వాసం కోల్పోయిన జగన్..వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాయుడుతో ప్రచారం చేయించాలని భావిస్తున్నారట. రాయుడు రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయమని చెప్పారు. కానీ, ఏ పార్టీ అనేది మాత్రం ఇంకా బయటపెట్టలేదు. కానీ, ఇటీవల సీఎం జగన్ ను కలుసుకోవడం, ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు పెట్టడం లాంటి పరిణామాలతో ఆయన వైసీపీలో చేరనున్నారని తేలిపోయింది. అంబటి రాయుడు గ్రామాల పర్యటనను వైసీపీయే తెర వెనుక నుండి కోఆర్డినేట్ చేస్తోందని అంటున్నారు. ఇదంతా ఐ ప్యాక్ గైడెన్స్ లో జరుగుతోందని తెలుస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కాపు ఓట్లు ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో గుంటూరు, విజయవాడ రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీయే గెలుచుకుంది. అక్కడ టీడీపీని టార్గెట్ చేస్తూ.. కాపులను తమవైపు తిప్పుకోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన రాయుడిని జగన్ రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేయడానికి వైసీపీకి సరైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పోటీచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. గుంటూరు ఎంపీ సీటు కన్ఫామ్ అయ్యింది కాబట్టే రాయుడు ఇలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని కూడా చర్చ సాగుతోంది. విజయవాడలోనూ వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన పీవీపీ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఇది కూడా రాయుడికి ఒక ఆప్షన్‌గా ఉందట. అంతా అనుకున్నట్లు జరిగితే గుంటూరు ఎంపీగా… పరిస్థితులు అనుకూలించకపోతే విజయవాడ ఎంపీగా రాయుడును పోటీచేయించాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.

ఏపీలో ఏ పార్టీ గెలవాలన్నా కాపు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు. రాయుడు ఇదే సామాజిక వర్గం కావడంతో జగన్ పక్కా ప్లాన్‌తో కాపు కార్డుతో వెళ్తున్నారని అర్థమవుతోంది. ఎన్నికలకు ముందే జనాల్లో తిరగడం, వంగవీటి విగ్రహానికి నివాళులు అర్పించడం దాంట్లో భాగమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. స్టార్ క్యాంపెయినర్‌గా రాయుడిని కాపు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించేందుకు జగన్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన జగన్ పాలనపై కాపులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముద్రగడ, రాయుడు లాంటి వారిని జగన్ ఎంతమందిని ప్రయోగించినా నో యూజ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే కాపులంతా టీడీపీ, జనసేనకు మద్దతుగా నిలవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *