వైసీపీలో మరో వికెట్ డౌన్ ?

వైసీపీలో మరో వికెట్ డౌన్ ?

వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. జగన్ కు నమ్మిన బంటులుగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలంతా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ బాటలోనే మరో నేత ఉన్నారు. గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న వైసీపీ ఎంపీ ఒకరు …అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి విధేయుడైన తనను కాదని, వలసొచ్చిన నేతను జగన్ నెత్తిన పెట్టుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే, ఇండిపెండెంట్ గానైనా పోటీకి సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. దీంతో, రామచంద్రాపురం అధికార పార్టీలో రాజకీయం వేడెక్కుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీలో మరో ప్రజాప్రతినిథి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. జగన్ కు మొదట్నుంచి నమ్మిన బంటుగా ఉన్నారు. అలాంటి బోస్ ను జగన్ కొంతకాలంగా పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిల్లి సుభాష్. అయితే, గత ఎన్నికలకు ముందు ఆయనను కాదని చెల్లుబోయిన వేణుకు జగన్ సీటిచ్చారు.

రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు గెలవగా, మండపేటలో బోస్ ఓడిపోయారు. అయితే, అధికారంలోకి వచ్చాక జగన్ బోస్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. కానీ, ఆ పదవిలో కుదురుకోక ముందే… మండలి రద్దు చేస్తానని చెప్పి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. మండపేటకు తోట త్రిమూర్తుల్ని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో, బోస్ కు జిల్లా రాజకీయాల్లో చోటులేకుండా పోయింది.

రామచంద్రాపురంలో వలసొచ్చిన వేణుగోపాలకృష్ణ పెత్తనం ఎక్కువైపోవడంతో పిల్లి సుభాష్ వర్గం ఆగ్రహంతో ఉంది. ఈక్రమంలోనే రెండు వర్గాల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తన తనయుడు సూర్యప్రకాష్ కు టిక్కెట్ ఇవ్వాలని బోస్ కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ, జగన్ బోస్ విజ్ఞప్తిని పక్కనబెట్టేశారట. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని పిల్లి సుభాష్ అనుచరులు వాపోతున్నారు. తమ వారిని మంత్రి వేణుగోపాలకృష్ణ టార్గెట్ చేస్తున్నారని సుభాష్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం ఎంతో చేసినా జగన్ తమను పట్టించుకోవడం లేదని బోస్ సన్నిహితుల వద్ద వాపోయారట. ఈ క్రమంలోనే ఎంపీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. వేణుకు టిక్కెట్‌ ఇస్తే స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది.

ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బోస్.. కాకినాడ, కోనసీమ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాలకు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. రాజమండ్రిలో జరిగిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ పార్టీ మీటింగ్‌లకు దూరంగా ఉండటం కలకలం రేపింది. తన నిరసన అధినేత దృష్టికి వెళ్లాలనే బోస్ ఆ సమావేశాలకి వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా, అధిష్టానంపై అలకబూనిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోతే.. తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తన అనుచరులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయింది. ఇక, పార్టీ కీలక నేతలు చేజారితే వైసీపీకి కష్టకాలమేనంటున్నారు విశ్లేషకులు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *