
వెంకటేశ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులని మీకు తెలుసా?
- NewsPoliticsTelangana Politics
- June 28, 2023
- No Comment
- 25
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో వెంకటేశ్ ఇద్దరూ బంధువులని మీకు తెలుసా? అవును…వెంకటేశ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ సోదరులు వరుస అవుతారు. అదెలాగో తెలుసుకునే ముందు…పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వెనక కూడా పెద్ద కథే ఉంది. రామసహాయం సురేందర్ రెడ్డి..ఈయన కరడుగట్టిన కాంగ్రెస్ నేత. అనుచరులు, అభిమానులు ఆయన్ను ఆర్ఎస్ గా పిలుచుకుంటారు. దాదాపు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందిన వ్యక్తి. ఈయన పొంగులేటికి బంధువు. సురేందర్ రెడ్డి వల్లే పొంగులేటి కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది.
సురేందర్ రెడ్డికి ఓ కుమారుడు రఘురామిరెడ్డి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రఘురామిరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రితను పెళ్లి చేసుకున్నారు. చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి.. పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకటేష్ లు ఇద్దరూ బంధువులయ్యారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వెనక ఈ పెద్దాయనే చక్రం తిప్పారు. 30 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా రాజకీయాలు రామసహాయం చుట్టూ తిరిగేవని అభిమానులు చెబుతుంటారు. అంతేకాదు.. కాంగ్రెస్‌లో కాకలుదీరిన నేతగా ఉన్న సురేందర్ రెడ్డి..తన శిష్యులుగా చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కీలక పదవుల్లో కూర్చోబెట్టారు. కానీ, ఆయన ఇంటి నుంచి మళ్లీ రాజకీయాల్లోకి ఎవరూ రాలేదు. ఇలా సురేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్ అంతా బంధువులేననే విషయం తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.