జగన్ కు ఆర్ కృష్ణయ్య హ్యాండిచ్చారా?

జగన్ కు ఆర్ కృష్ణయ్య హ్యాండిచ్చారా?

ఆర్ కృష్ణయ్య…బీసీలకు నేనే నాయకుడిని అంటాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా బీసీ నినాదాన్ని లేపుతాడు. అయితే, ఈయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికీ తెలియదు. తన అవసరం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడనే పేరు ఉంది. కృష్ణయ్య దశాబ్దానికిపైగా బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ, బీసీల అభవృద్ధికి ఆయన పాటుబడింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. సంఘాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా పలుకుబడితో పాటు అనేక పదవులు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపిలో చేరి ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు టీడీపీ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. కానీ, ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడియారు. ఆ ఓటమి తర్వాత తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే రివర్సై కేసీఆర్‌ భజన ప్రారంభించారు కృష్ణయ్య. ఆ భజన ఫలితమో, అదృష్ణమో గానీ వైసీపీ పెద్దలు పిలవడంతో ఏపీలో వాలిపోయాడు. తన స్వార్థ పూరిత రాజకీయాల కోసం టీడీపీకి వ్యతిరేకంగా జగన్ భజన చేశాడు. ఇంకేముంది జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చక్కా రాజ్యసభ సీటు తెచ్చుకున్నాడు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనా, ఏ రోజు కృష్ణయ్య రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గళమెత్తింది లేదు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్‌ రావడంతో తెలంగాణలో వాలిపోయాడు కృష్ణయ్య. తెలంగాణ కాంగ్రెస్‌ కోసం… ఆ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉందనే షో చేయడం ప్రారంభించాడు. ఈ మేరకు తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీగా ఉన్న కృష్ణయ్య…కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంపై జగన్ గుర్రుగా ఉన్నారట. అయితే, ఆయన్ను ఏమీ అనలేని పరిస్థితి. కృష్ణయ్యపై చర్యలు తీసుకుంటే బీసీల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న భయంతో…. వైసీపీ ఆయనకు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది. కృష్ణయ్య తెలంగాణ బాట పట్టడంతో జగన్ కు హ్యాండిచ్చినట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కృష్ణయ్య మొదట్నుంచి హోల్ సేల్ గా బీసీలను తన స్వార్థపూరిత రాజకీయాల కోసం పార్టీలకు అమ్ముకుంటున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఐనా సరే, ప్యాకేజీలకు ఆశపడి పార్టీలు మారడం, పదవులు తెచ్చుకోవడం కృష్ణయ్యకు ఫ్యాషన్ గా మారిందని సొంత కులస్తులే తిట్టిపోస్తున్నారట. కృష్ణయ్య రాజకీయంగా ఎదిగేందుకు తమను పావులు వాడుకోవడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈసారి ఆయన ఏ పార్టీ వెంట నిలిచినా, తమ మనోగతం మేరకే నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఓ పార్టీ తరపున ఎంపీగా పనిచేస్తూ, మరో రాష్ట్రంలో మరో పార్టీతో కలిసి రాజకీయం చేయడం కృష్ణయ్యకే చెల్లిందేమో. కులపెద్దగా చెలామణి అవుతూ, రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కృష్ణయ్యను…బీసీలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *