పొంగులేటిని జగనే కాంగ్రెస్ లోకి పంపించారా?

పొంగులేటిని జగనే కాంగ్రెస్ లోకి పంపించారా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరికపై ఇప్పుడు ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. పొంగులేటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాంగ్రెస్ లోకి పంపించారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ గా మారారు. బీఆర్ఎస్ నుంచి బయటపడి, ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు . ఖమ్మంలో కనివినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడం వెనక జగనే ఉన్నారని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే, హస్తం గూటికి చేరిన పొంగులేటి తాడేపల్లిలో జగన్ ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. ఆయన వైసీపీ నుంచే మొదట ఖమ్మం ఎంపీగా గెలిచారు. మరో ముగ్గురు ఎమ్మెల్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలతో పొంగులేటి బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు కూడా జగన్ సూచనతోనే ఆయన గులాబీ గూటికి చేరారనే ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు కూడా జగన్ సూచనలు, సలహాలతోనే..పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ కేంద్రంలోని మోడీ సర్కార్ కు అన్ని సందర్భాల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, భవిష్యత్ అవసరాల కోసం జగన్ వ్యూహాత్మకంగా.. కాంగ్రెస్ లోకి పొంగులేటిని పంపించారన్న ప్రచారం జరుగుతోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలు కంపెనీలు ఏపీలో కాంట్రాక్టులు పొందాయి. కడపలో వరదల ధాటికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణ కాంట్రాక్ట్ కూడా పొంగులేటి కంపెనకే దక్కింది. త్వరలోనే ఏపీలో వ్యవసాయ మోటార్లు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగించనున్నారు. దక్షిణ, మధ్య డిస్కమ్‌లలో టెండర్లను కూడా ఖరారుచేశారు. ఇందులో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రూ.2056.95 కోట్ల విలువైన పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కింది. కన్ స్ట్రక్షన్స్ కు, విద్యుత్ మీటర్లకు సంబంధం లేకపోయినా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటే..ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *