ఆర్జీవీ డెన్ వెనుక వైసీపీ..?

ఆర్జీవీ డెన్ వెనుక వైసీపీ..?

టాలీవుడ్, బాలీవుడ్ లోనూ.. వివాదాలకు మారు పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ.. ఒక వర్గం వారిని.. కావాలని రెచ్చగొట్టేవిధంగా .. ప్రవర్తిస్తూ.. కేవలం వార్తల్లో ఉండేందుకే వర్మ ప్రయత్నిస్తుంటారు.ఎటువంటి నిజం లేకపోయినా.. ఒక దుష్ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్ , ఆర్జీవీ మధ్య వివాదం చాలా కాలం నుంచి నడుస్తోంది. ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌కుండా.. ఆర్జీవీ మోసం చేస్తున్నాడంటూ నిర్మాత న‌ట్టికుమార్ ఆరోప‌ణ‌లు చేయడం.. అలాంటిదేమీ లేదని.. వర్మ చెప్పడం కొంత కాలం నుంచి నడుస్తున్న చరిత్ర.

ఒక‌ప్పుడు గ్రేట్ డైరెక్ట‌ర్ వ‌ర్మ.. ఇప్పుడు ఛీటింగ్ వ‌ర్మగా పేరు తెచ్చుకున్నారని నట్టికుమార్ ఆరోపించారు. ఆర్జీవీ.. నా ఒక్క‌డినే కాదని.. చాలా మందికి యాబై ల‌క్ష‌లు, కోటి, రెండు కోట్ల రూపాయల వరకు మోసం చేశాడని నట్టికుమార్ ఆరోపించారు. నిర్మాతలు ప్ర‌స‌న్న‌కుమార్, రామ స‌త్య‌నారాయ‌ణ లాంటి వారిని అడ్డు పెట్టుకుని.. ఆర్జీవీ అనే మోసగాడు.. బతుకుతున్నాడని.. నట్టికుమార్ ఆరోపించారు. ఎవరికైనా.. డబ్బు.. ఎలా ఎగ్గొట్టాల‌ని క్రిమిన‌ల్ మైండ్‌తోనే ఆర్జీవీ ఆలోచిస్తాడని చెప్పారు. ముంబైలో ఆఫీసు ఖ‌రీదు ఐదు వంద‌ల కోట్లు అని ప్రగల్బాలు పలికి.. తీరా దానికి రెంట్ క‌ట్ట‌క రాత్రికి రాత్రే .. హైదరాబాద్ పారిపోయి .. ఆర్జీవీ వ‌చ్చేశాడని.. నట్టికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే గోవాలోనూ ఆఫీసు తీసుకుని.. రెండు కోట్లు అప్పు పెట్టేసి పారిపోయి వచ్చాడన్నాడు. గోవాలో వర్మ దగ్గర పనిచేసిన.. డ్రైవ‌ర్‌కి డ‌బ్బులు ఇవ్వక పోతే.. ప‌బ్‌లో వ‌ర్మ‌ను చిత‌క బాదారని.. నట్టికుమార్ ఆరోపించారు. ఇలాంటి నీచమైన బతుకు బతకడం .. వర్మకే సాధ్యమని నట్టి కుమార్ అన్నారు.

సినిమా టికెట్లు రేట్లు పెంపు విషయంలో గతంలో .. వైసీపీ మంత్రి పేర్ని నానితో వాడీవేడిగా డిబేట్లు నడిపిన వర్మ … ఆ తర్వాత వైసీపీకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు. ఎందుకంటే ఆర్జీవీకి కావాల్సింది డబ్బు…. ఆ డబ్బుకోసమే.. ఎలాంటి యూ టర్న్ అయినా తీసుకుంటారు. గతంలో.. తిక్క తిక్క పనులు చేసి దాదాపు 20 కోట్ల వరకు అప్పులు చేశారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న ఆర్జీవీకి.. వైసీపీ బంగారు బాతులాగా కనిపించింది. బాకీలు తీర్చేందుకే వైసీపీ చిల్లరకు ఆర్జీవీ అలవాటుపడ్డాడు.ఆ టైంలో కొందరు వైసీపీ నాయకులు డబ్బులు ఆఫర్ చేయడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు తీశారు. ఈ మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు.. ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఇది జరిగిన కొద్ది కాలం తర్వాత.. హైదరాబాద్ లో ఆర్జీవీ డెన్ పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు వర్మ. గతంలో ముంబైలో.. తినడానికి.. రెంట్ కట్టడానికి .. అష్టకష్టాలు పడిన వర్మ.. సడెన్ గా ఒక పెద్ద ఆఫీసు ఎలా ఓపెన్ చేశాడో.. అర్థం కాని.. మిలియన్ డాలర్ల ప్రశ్న. వైసీపీ నుంచి డబ్బులు రావడం వల్లే.. సడన్ గా వర్మ .. ధనవంతుడయ్యాడని..టాలీవుడ్ లో.. కొందరు గుసగుస లాడుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *