
డీసీపీ కారును ఢీకొట్టిన డింపుల్..కేసు నమోదు
- NewsTelangana Politics
- May 23, 2023
- No Comment
- 77
ఓ ఐపీఎస్ అధికారి కారును కాలితో తన్ని, ఢీకొట్టి నానా రచ్చ చేసిన…నటి డింపుల్ హాయతి పై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయింది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే కారును ధ్వంసం చేసిన వ్యవహారంపై… డింపులో తో పాటు డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.
జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో నటి డింపుల్ హయతి, డేవిడ్ ఉంటున్నారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో డీసీపీతో డింపుల్ గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎస్ అధికారి వాహనాన్ని కాలితో తన్నడం,దుర్బాషలాడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ట్రాఫిక్ డీసీపీ కి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ఆయనకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హాయతి, డేవిడ్ లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డిసిపి వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హయతి తన వాహనంతో డిసిపి కారును ఢీకొట్టింది. డింపుల్ , డేవిడ్లను పోలీస్ స్టేషన్కు పిలిచి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు.