డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు

డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పటికే గంజాయి, హెరాయిన్ ఎగుమతులకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారు. తాజాగా మరో డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. కాల్షియం టాబ్లెట్ల ముసుగులో నిషేధిత ట్రెమడాల్ డగ్స్ ఎగుమతి చేస్తూ, కీలక వైసీపీ నేతల సన్నిహితుడు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ముగినిపోయిన వైసీపీ పెద్దలకు, ఈ డ్రగ్స్ వ్యవహారం పుట్టి ముంచేలా ఉంది. అసలు ఏపీలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోవడానికి కారణం ఎవరు? డ్రగ్స్ మాఫియా నుంచి వైసీపీ పెద్దలకు కమీషన్లు అందడమే వారు రెచ్చిపోవడానికి ప్రధాన కారణమా?

డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారింది. ఇప్పటికే గంజాయి, హెరాయిన్ సరఫరాతో దేశ వ్యాప్తంగా ఏపీ పరువు పోయింది. తాజాగా మరో భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఐసిస్ డ్రగ్ గా పేరుపడ్డ ట్రెమడాల్ మాదకద్రవ్యాన్ని మాత్రల రూపంలో సూడాన్ కు ఎగుమతి చేస్తోన్న ముఠాను ముంబయి కస్టమ్స్ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఐసిస్ డ్రగ్ ను నరసరావుపేట కేంద్రంగా నడుస్తోన్న సేఫ్ ఫార్మాలో తయారుచేసినట్టు గుర్తించారు. గతంలో ఈ కంపెనీ దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు యాజమాన్యంలో ఉండేది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక నరసరావుపేటకు చెందిన వైసీపీ నేత శ్రీధర్ రెడ్డి సేఫ్ కంపెనీని కొనుగోలు చేశారు. గడచిన మూడున్నరేళ్లుగా శ్రీధర్ రెడ్డి యాజమాన్యంలో ఈ కంపెనీ నడుస్తోంది. కాల్షియం టాబ్లెట్ల ముసుగులో ట్రెమడాల్ డ్రగ్స్ ను సూడాన్ కు ఎగుమతి చేస్తూ శ్రీధర్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది. వారం కిందటే అరెస్టైనా అధికార వైసీపీ నేతలు గోప్యంగా ఉంచారు. నేరుగా డ్రగ్స్ ను సేఫ్ ఫార్మా పేరుతో ఎగుమతి చేస్తే సమస్యలు వస్తాయని గ్రహించిన యాజమాన్యం, బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ పేరుతో కాల్షియం మాత్రల పేరుతో దక్షిణ సూడాన్ రాజధానికి జుబాకు ఎగుమతి చేస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఈ స్మగ్లింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. తాజాగా కాల్షియం మాత్రల పేరుతో ఎగుమతికి సిద్దం చేసిన కంటెయినర్ ను ముంబయి కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 10 లక్షల డ్రగ్స్ మాత్రలను సేఫ్ ఫార్మాలో తయారు చేశారని గుర్తించిన అధికారులు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడం వైసీపీ పెద్దల్లో వణుకు పుట్టిస్తోంది.

సేఫ్ ఫార్మా యాజమానిగా ఉన్న శ్రీధర్ రెడ్డి ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందోలో కీలక పదవిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంత అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి అరవిందో ఫార్మా ఎండీగా ఉన్నారు. అంటే ఈ డ్రగ్స్ మాఫియా వెనుక వైసీపీలో కీలక నేతలే ఉన్నట్టు రూఢి అవుతోంది. కాల్షియం మాత్రల పేరుతో భారీగా ట్రెమడాల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మార్చి12నే అరెస్టు చేశారు. బెంగళూరు సంస్థ ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సీఈవో గుడిపాటి సుబ్రమణ్యాన్ని గత నెలలో అరెస్టు చేసి, లోతుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ డ్రగ్ తయారీలో తనకు ఎలాంటి సంబంధం లేదని నరసరాపుపేట కేంద్రంగా నడుస్తోన్న సేఫ్ ఫార్మాలో ఇవి తయారైనట్టు సుబ్రమణ్యం కస్టమ్స్ అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. దీంతో సేఫ్ ఫార్మా సంస్థ యజమాని శ్రీధర్ రెడ్డిని గత వారం ముంబయి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గడచిన మూడున్నరేళ్లుగా దక్షిణ సూడాన్ లోని హెల్త్ గ్లోబల్ వెల్ నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేసినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ట్రెమడాల్ డ్రగ్ తయారు చేయడాన్ని 2018లోనే కేంద్రం నిషేధించింది. ఈ మాత్రలు తక్కువ డోసులో తయారు చేయాలన్నా ఎప్పటికప్పుడు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టాబ్లెట్స్ వాడటం ద్వారా అలసిపోకుండా ఎక్కువ సమయం పనిచేయగలుతుతారు. సూడాన్ లోని ఐసిస్, బోకోహరామ్
తీవ్రవాదులు ఈ ట్రెమడాల్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. నార్కొటిక్స్ అనుమతులు లేకుండా తయారు చేయడం ఒక నేరం అయితే, కాల్షియం మాత్రల ముసుగులో ఎగుమతి చేయడం, తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా కీలక వైసీపీ నేతకు సన్నిహితుడు శ్రీధర్ రెడ్డికి చెందిన సేఫ్ ఫార్మాలో ఇప్పటికే కోట్లాది ట్రెమడాల్ మాత్రలు తయారు చేసి సూడాన్ కు ఎగుమతి చేసినట్టు ముంబయి కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

నార్కోటిక్స్ నిషేధం విధించిన ట్రెమడాల్ తయారీ, విదేశాలకు ఎగుమతుల వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందనే అనుమానం వస్తోంది. కేంద్రం నిషేధించిన మందుల తయారీకి రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి ఎలా అనుమతులు ఇచ్చింది. ట్రెమడాల్ ఎగుమతి ఆర్డర్ చూడకుండానే సేఫ్ ఫార్మా యాజమాన్యం డ్రగ్ తయారు చేసి ఎలా ఇచ్చింది. అసలు కాల్షియం మాత్రల ముగసులో ట్రెమడాల్ ఎగుమతి ఎలా చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ కీలక నేతల అండదండలు లేకుండా డ్రగ్స్ తయారీ, ఎగుమతి సాధ్యం కాదనే విమర్శలు వస్తున్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *