
నెల్లూరులో నారాయణ పూజలు
- Ap political StoryNewsPolitics
- September 19, 2023
- No Comment
- 12
నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. 8వ డివిజన్‌లోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో పర్యటించిన నారాయణ.. స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అనంతరం 45వ డివిజన్ పరిధిలోని గచ్చు కాలువ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అక్కడ కూడా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నెల్లూరు 13వ డివిజన్‌లోని యలమవారిదిన్నె ప్రాంతంలో నారాయణ పర్యటించారు. అక్కడ కొలువుదీర్చిన గణపతి దేవుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా .. మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రతో అరెస్టయిన చంద్రబాబునాయుడిని త్వరగా విడుదల చేయాలని దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ తీరును విదేశాల్లోని తెలుగు ప్రజలు కూడా.. తప్పుబడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు అవినీతి చేయలేదనే వాస్తవాన్ని.. వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని నారాయణ అన్నారు.