అబ్బనీ తీయని దెబ్బ..సీఐ సినిమా లీలలు

అబ్బనీ తీయని దెబ్బ..సీఐ సినిమా లీలలు

బాధ్యత గల విధుల్లో ఉండి దొంగలకే దొంగగా మారింది ఆ పోలీస్ ఆఫీసర్. సినిమాలపై మోజుతో అడ్డదారులు తొక్కింది. అవకాశాల కోసం వైసీపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకుని.. పైసా వసూల్ కు పాల్పడింది. అరెస్ట్ అయ్యింది. విశాఖపట్టణం నోట్ల మార్పిడి కేసులో ఇద్దరు వ్యక్తులను బెదిరించి..12 లక్షలు వసూలు చేసిన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడంగారి మాస్ డ్యాన్స్ లు, స్టైలిష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ కేసు నుంచి ఆమెను తప్పించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు, వైసీపీ ముఖ్యనేతలపై ఒత్తిడి పెంచడం కలకలం రేపుతోంది.

అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వర్ణలత హీరోయిన్‌గా ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్‌’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందుకు డబ్బుల నిమిత్తమే నోట్ల మార్పిడిలో ఆమె కీలకంగా వ్యవహరించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రంలో కూడా ఆమెది పోలీసు అధికారిణి పాత్రే కావడం విశేషం. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. డాన్సులు నేర్చుకుంటే త్వరలో తీసే సినిమాలో ఛాన్స్ ఇస్తానని, ఓ ప్రజాప్రతినిథి చెప్పారట. అందుకే గత కొంతకాలంగా ఆమె ఒక కొరియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుని డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. రెండు పాటలకు ఆమె డాన్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గతంలో ఏఆర్‌ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో స్వర్ణలతపై ఆరోపణలొచ్చాయి. విజయవాడ, శ్రీకాకుళం, వైజాగ్ ఇలా ఎప్పుడూ ఆమె బదిలీలపైనే ఉంటున్నారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసి తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొందరు రియల్టర్లతోనూ సీఐ స్వర్ణలతకు పరిచయాలున్నాయని తెలుస్తోంది. కమీషన్‌ తీసుకుని.. ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు నుంచి స్వర్ణలతను బయటపడేసేందుకు ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నారంటే… ఆమెతో వైసీపీ నేతలకు రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. విశాఖను అధికార వైసీపీ నేతలు అరాచకశక్తులకు అడ్డాగా మారుస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *