ఏపీ వైపు కన్నెత్తి చూడని కంపెనీలు..! జగన్ గారూ.. మీకు అర్దమౌతోందా..?

ఏపీ వైపు కన్నెత్తి చూడని కంపెనీలు..! జగన్ గారూ.. మీకు అర్దమౌతోందా..?

జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా ఏపీవైపు కంపెనీలు కన్నెత్తి చూడడం లేదు. ఉన్న పరిశ్రమలనే తరిమేస్తుండడంతో, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇటీవలే ఏపీలో జగన్ సర్కార్ వేధింపులతో తెలంగాణకు షిఫ్ట్ అయిన అమరరాజా కంపెనీ, ఘనంగా భూమిపూజ జరుపుకుంది. ఆ తరహాలోనే తెలంగాణకు తరలిపోయిన మరో భారీ కంపెనీ కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమవుతోంది.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్… తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోంది. కొంగరకలాన్ లో మే 15న భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పెట్టుబడులు రాగా, మరికొన్ని తలుపు తడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ రాష్ట్రంలో పెట్టబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ లో… ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 15న పరిశ్రమ భూమిపూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తైవాన్‌ నుంచి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. ఫాక్స్‌కాన్‌ రాకతో రాష్ట్రంలో లక్షమంది యువతకు ఉపాధి అవకాశం లభించనుంది.

తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతుంటే… పక్కనే ఉన్న ఏపీలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలౌతోంది. ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా… వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి.

జగన్ రెడ్డి పాలనలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోగా, పెట్టుబడిదారులను బెదిరించే ధోరణితో… ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ వేధింపుల కారణంగా వెళ్లిపోయిన అమరరాజా…తెలంగాణలో ఇటీవలే భూమిపూజ జరుపుకుంది. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, పరిశ్రమలే తప్ప…జగన్ వచ్చాక చేసిందేమీ లేదు. దాంతో, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం తాండవిస్తోంది. అందుకే, చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు తరలిపోతున్నారు.

ఏపీ నుంచి ఫాక్స్ కాన్ తెలంగాణకు తరలిపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలో ఉన్న పరిశ్రమలను జగన్ పొరుగు రాష్ట్రాలకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫాక్స్ కాన్ మొదటి ఐఫోన్ తయారీ యూనిట్‍కు తమ ప్రభుత్వ హయాంలో ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపార వాతావరణం ఆరోగ్యకరంగా ఉండి ఉంటే పరిశ్రమ విస్తరించేవారని.. కానీ అలాంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

ప్రభుత్వ మద్దతు పుష్కలంగా ఉంటే ఏపీలోనే వేల ఉద్యోగాలు కల్పించే అవకాశముండేదని నారా లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా ఏపీవైపు పారిశ్రామికవేత్తలు చూసే పరిస్థితి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు లోకేష్.

స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా తైవాన్‌కు చెందిన “ఫాక్స్‌కాన్” గుర్తింపు పొందింది. మనం నిత్యం వాడే యాపిల్ ఐఫోన్ తో సహా ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీల మొబైల్స్ , ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు “ఫాక్స్‌కాన్” లోనే తయారు అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. దీనికి ఐదారు రెట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఫాక్స్ కాన్ సంస్థ తన తాజా తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించడం విశేషం. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో 250 ఎకరాల్లో ఈ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది.

తెలంగాణకు ఫాక్స్ కాన్ రావడం వెనుక సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఓ కారణమైతే.. గతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ISB విషయంలో చూపించిన చొరవను పలువురు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ను తీసుకు రావటం వెనుక చంద్రబాబు ఎనలేని కృషి దాగి ఉంది. చంద్రబాబు గతంలో అనుసరించిన విధానాల్నే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అయ్యారు.

ఇటీవల ” టీ వర్క్స్ ” ప్రారంభానికి హైదరాబాద్ వచ్చిన “ఫాక్స్‌కాన్” ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తూనే.. ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌కు అద్భుతమైన ఆతిథ్యం అందించారు. దాంతో, ఫిదా అయిపోయిన ఫాక్స్ కాన్ ప్రతినిథులు తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టబడుల విషయంలో చంద్రబాబు ఏవిధంగా ట్రెండ్ సెట్ చేశారో…ఇప్పుడు అందరూ ఆయన విధానాన్ని ఫాలో అవుతున్నారు.

 

Related post

జగన్ పొమ్మన్నాడు..కేసీఆర్ రమ్మన్నాడు

జగన్ పొమ్మన్నాడు..కేసీఆర్ రమ్మన్నాడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరిమేసిన కంపెనీలన్నీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఏపీ నుంచి సాగనంపిన జాబితాలో మరో కంపెనీ చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లులూ సంస్థ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *