
గంజాయి మద్యం అడ్డాగా తిరుమల
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 38
పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో గంజాయి రవాణా కలకలం రేపింది. తిరుమల కొండపై మద్యం, మాంసం, గంజాయి, మత్తుపదార్థాలు, సిగరెట్లు నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కొందరు ఉద్యోగులు గంజాయి, మద్యం తిరుమల కొండపైకి తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
వైకంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉద్యోగిగా పని చేస్తున్న గంగాధరం వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద 125 గ్రాముల బరువున్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. తిరుపతి, తిరుమలలో గంగాధరం చాలాకాలంగా గంజాయి రవాణా చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
కొద్దికాలం కిందట తిరుమలలో మద్యం సీసాలను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో జీఎన్సీ టోల్ గేట్ వద్ద రెండు కూరగాయల వాహనాల్లో.. 200 గ్రాముల గంజాయిని పోలీసులు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ గంజాయి, మద్యం పట్టుబడుతూ ఉండటంపై నిఘా అధికారులపై కూడా భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో తిరుమలను అరాచక శక్తులకు అడ్డాగా మార్చారనే విమర్శలు వస్తున్నాయి…