అగ్రిగోల్డ్‌ కి మోక్షం.. మార్గదర్శిపై కక్ష సాధింపా

అగ్రిగోల్డ్‌ కి మోక్షం.. మార్గదర్శిపై కక్ష సాధింపా

40 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తూ ప్రభుత్వ నియమనిబంధనలకు కట్టుబడి పైనాన్స్‌ కార్పొరేషన్లో విశిష్ట సేవలందిస్తున్న మార్గదర్శి చిట్‌ ఫండ్‌ పై ఎందుకంత కక్ష సాధింపని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. దేశంలో ఏ చిట్‌ ఫండ్‌ సంస్థకు లేనటువంటి ఖాతా దారులు మార్గదర్శికి ఉన్నారని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్దత విలువలతో కూడిన ఈ సంస్థను 40 ఏళ్ల క్రితం రామోజీరావు స్థాపించారని అన్నారు. సంస్థ ఏర్పాటు అయిన దగ్గర నుండి నేటివరకు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు చెల్లెస్తున్నారని అన్నారు.

దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటున్నారని, ఏ ఖాతా దారుడు అన్యాయం జరిగిందని రిపోర్ట్‌ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం అత్స్యుత్సాహం ప్రదర్శించడం ప్రజలను గందరగోళానికి గురి చేయడమేనని అన్నారు. మార్గదర్శి ద్వారా కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది చేకూరుతుందని అన్నారు. అలాంటి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి దర్యాప్తు పేరిటా యాజమాన్యాన్ని వీధించడం మానుకోవాలని గంటా నూకరాజు హితవు పలికారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో అగ్రిగోల్డ్‌ బాదితులను అన్ని విధాలుగా ఆడుకుంటానని, మీకు రావలసిన ప్రతీ పైసా చెల్లించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన మీరు, అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎంతమందికి న్యాయం చేశారని నిలదీశారు.
అవన్నీ వదిలేసి పేద ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ను పట్టుకొని ఎందుకు వేదిస్తున్నారని అడిగారు. మార్గదర్శి ద్వారా న్యాయం జరుగుతుందని, కుటుంబానికి పెద్ద దిక్కుగా అండగా ఉంటుందని లబ్ధిదారులు అయిన ప్రజలే చెబుతున్నారని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంతలా స్పందిస్తుందని గంటా నూకరాజు ప్రశ్నించారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *