జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది : గంటా, బండారు

జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది : గంటా, బండారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి , మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండుటెండలో సైతం లోకేష్‌ పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 1/4 పూర్తయిందన్నారు. పాదయాత్రలో లోకేష్‌ పరిపూర్ణమైన నాయకుడిగా రూపు దిద్దుకుంటున్నారని కొనియాడారు.

జగన్‌ ప్రభుత్వాన్ని కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందని.. 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే తరువాయి అని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఢల్లీి వెళ్లి.. లోపాయి కారీగా స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. విశాఖలో పేర్లు మార్పిడి పరంపర, కొనసాగుతోందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్‌కు, వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా మార్చడం సరైనది కాదన్నారు. ఆ ప్రాంత మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని, అవసరమైతే జాతి నాయకుల పేర్లు పెట్టాలని కోరుతున్నామన్నామని గంటా శ్రీనివాసరావు అన్నారు.

బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ అందరి ఆశీస్సులు లోకేష్‌కు ఉండాలని కోరుతున్నానన్నారు. చేసిన అభివృద్ధిపై సెల్ఫీ చాలెంజ్‌ పెడుతున్నారని, బాబాయి వివేకా హత్య ఉదంతం,బయటపడుతుందని సీఎం జగన్‌ లండన్‌ టూర్‌ రద్దు చేసుకున్నారని అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో ఏం అవసరమైతే అవి ఇప్పుడే మరమ్మతులు చేయించుకుంటే మంచిదని బండారు సత్యనారాయణ మూర్తి సూచించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *