కన్నింగ్ కేతిరెడ్డికి ఇక నుంచి బ్యాడ్ మార్నింగే..

కన్నింగ్ కేతిరెడ్డికి ఇక నుంచి బ్యాడ్ మార్నింగే..

యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అక్రమాలను బయటపెడుతుండడంతో జగన్ తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్న ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా లోకేష్ బట్టబయలు చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో వచ్చి కొండలు, గుట్టలు కాజేస్తున్నాడంటూ సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచారు లోకేష్. కేతిరెడ్డి మహా కన్నింగ్ అని తెలుసుకుని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కోడికూయగానే నిద్ర లేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా…? ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నట్లు పైకి బిల్డప్ ఇస్తూ, లోపల పెద్ద గూడుపుఠాణే నడుపుతున్నారు. ఎక్కడ భూములు, కొండలు, గుట్టలున్నాయో చూసుకొని.. కబ్జా చేసేందుకు మంది మార్బలంతో రోడ్డెక్కుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ యువనేత లోకేష్ తన యువగళం పాదయాత్రలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారు. పాదయాత్రలో భాగంగా ధర్మవరం వెళ్లిన లోకేశ్‌..స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమాలపై ప్రశ్నించారు. ఎర్రగుట్టపై ఎమ్మెల్యే 20 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైన భవనంతో పాటు బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.అంతేకాదు, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సవాల్‌ చేయగా..లోకేశ్‌ ఎర్రగుట్ట ఆక్రమణపై ఆధారాలను బయటపెట్టారు.రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల ప్రకారం ఎర్రగుట్టపై 904, 905, 908, 909 సర్వే నంబర్లలోని భూమిని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో కొన్నట్లు ఉంది. రికార్డుల ప్రకారం కొనుగోలు చేసింది కేవలం 25.38 ఎకరాలు. మొత్తం 45 ఎకరాలు ఆయన ఆధీనంలో ఉంది. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా భూమిని కొలవగా 45.47 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని లోకేశ్‌ ప్రశ్నించారు.

” గుడ్ మార్నింగ్ ధర్మవరం” మాటున చేస్తున్న గుట్టు రట్టు కావడంతో కేతిరెడ్డి ఎంత కేటుగాడో తేలిపోయింది. రైతుల నుంచి 25 ఎకరాలు కొని మరో 20 ఎకరాలను కేతిరెడ్డి ఆక్రమించుకున్నారని లోకేష్ తేల్చిచెప్పారు. అంతేకాదు, గుట్టపై విలాసవంతమైన ఫామ్‌హౌస్‌, తోటలు, బోటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అధికారులు అబద్ధాలు చెప్పినా ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమాన్ని గూగుల్‌ మ్యాప్‌ పట్టిచ్చిందన్నారు. దమ్ముంటే అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని సర్వే చేయించాలని లోకేశ్‌ సవాల్‌ చేశారు.

2019 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్థి రూ.5 కోట్లుగా చూపించిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే అయిన తరవాత వందల ఎకరాలు ఎలా వచ్చాయని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు.తమ ప్రభుత్వం వచ్చాక కేతిరెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. దాంతో, రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల జరిగుండొచ్చంటూ ఎమ్మెల్యే బొంకుతున్నప్పటికీ, ఆయన అవినీతి బాగోతమంతా వెలుగులోకి రావడంతో, కేతిరెడ్డికి ఇక బ్యాడ్ మార్నింగే స్టార్ట్ అయినట్టేనని అంతా భావిస్తున్నారు.

Related post

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెల్లూరు వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులను హౌస్​ అరెస్టు చేయడంతో పాటు…
మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ

మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ

నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. నగర నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ఆయన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారు. రెండు రోజుల క్రితం 39వ డివిజన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *