ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా. చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం అరకులోయ మండలంలోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొని సంయుక్తంగా కేక్‌ కట్‌ చేసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి. అబ్రహం మాజీ మంత్రి శ్రావణ్‌ కుమార్‌ తోపాటు నాయకులకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర మళ్లీ అభివృద్ధి చెందాలంటే 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జీ.వి.ఆంజనేయులు ఆధ్వర్యంలో..
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మాజీ శాసన సభ్యులు జీ. వి, ఆంజనేయులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినవేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీమంత్రి, తెలుగుదేశంపార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమాను ల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, కారంపూడి రోడ్‌ లోని మాస్టిన్‌ కాలనీలో అన్నదానంతో పాటు పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, చిట్టిబాబు, వినుకొండ నియోజకవర్గం టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను దత్తత తీసుకున్న పల్లా
నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని తన మంచి మనసును చాటుకున్నరు. విశాఖపట్నం గాజువాక పెదగంట్యాడ 75 వ వార్డు ముసలి ఐడి పాలెం గ్రామంలో నివసిస్తున్న శివలక్ష్మి (29) భర్త రెండు సంవత్సరాల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో అకస్మాత్తుగా మరణించడం జరిగింది వాళ్లకు ఇద్దరు పిల్లలు దుర్గ(9) సాయి (6) వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పల్లా శ్రీనివాస్‌ వాళ్లకు ధైర్యం చెప్పే పిల్లలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు తనే చదివిస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు భారీగా హాజరయ్యారు.

పెనుకొండలో…
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ ను బి. కె. పార్థసారథి కట్‌ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు, ఐదు మండలాల కన్వీనర్లు, నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మహిళా నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎన్‌.బి.కె ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా గురువారం ధర్మవరం యన్‌. బి. కె ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ధర్మవరం మండలం గొట్లూరు అనాధ ఆశ్రమంలోని జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు ఆహార పొట్లాలు, పండ్లు పంచి పెట్టారు. బర్త్‌ డే కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో యన్‌. బి. కె. హరి, రమేష్‌, ముత్యాలు, కుళ్లాయప్ప, తేజ, గంగాధర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీ రక్తదాన శిబిరం
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా టిడిపి శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించారు. గురువారం ఆముదాలవలస పట్టణంలోని శారద కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం లో సుమారు 70 మంది రక్తదానం చేశారు. జిల్లా టిడిపి పార్లమెంటరీ అధ్యక్షుడు ఆముదాలవలస మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోగల పొందూరు, బూర్జ, ఆముదాలవలస సరుబుజ్జిలి మండలాలకు చెందిన టిడిపి శ్రేణులు తరలి రావడంతో భారీ సంఖ్యలో రక్త నిల్వలు సేకరించారు. శ్రీకాకుళం రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైద్య బృందం డాక్టర్‌ భాను సాయి కోఆర్డినేటర్‌ కే సత్యనారాయణ , రెడ్‌ క్రాస్‌ సభ్యులు బి. చిన్మయరావు, మహేషు, కళ్యాణ్‌ , సూర్య తదితరులతో పాటు టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *