50 వసంతాలు పూర్తి చేసుకున్న మొబైల్ ఫోన్

50 వసంతాలు పూర్తి చేసుకున్న మొబైల్ ఫోన్

సమాచార రంగంలో టెలిఫోన్ తీసుకువచ్చిన సంచలనం అంతా కాదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని, ఎప్పటికప్పుడు మాటలతో అనుసంధానం చేసిన తీరే అద్భుతం అనుకుంటే, మొబైల్ ఫోన్ అంతకంటే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాలకు వెళ్లినా మాటల వారిదిగా మారిపోయింది. ఇంటర్నెట్ రాకతో మరింత విజృంభించింది. యాప్ ల అనుసంధానంతో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇంతకీ మొట్టమొదటి మొబైల్ ఫోను తయారు చేసింది ఎవరో తెలుసా? అమెరికా ఇంజనీర్ మార్టిన్ కూపర్. మొట్టమొదటి మొబైల్ కాల్ చేసింది ఆయనే మరి. అందుకే మార్టిన్ ను సెల్ ఫోన్ పితామహుడుగా పిలుస్తారు. జపాన్ 2001లో తొలిసారిగా 3జి మొబైల్ నెట్వర్క్ ను వాడుకుంది. ఇది అత్యంత వేగంతో ఇంటర్నెట్ వాడటానికి తలుపులు తెరిచింది. 2009లోనే అత్యంత వేగంతో కూడిన 4జి శకం మొదలైంది. దీనిని వినియోగించిన తొలి నగరంగా స్టాక్ హోమ్ చరిత్రకు ఎక్కింది. మరింత వేగంగా ఇంటర్నెట్ వాడుకోవడానికి తోడ్పడే 5జి యుగం 2019లో మొదలైంది. దీనిని ప్రారంభించిన తొలి దేశం దక్షిణ కొరియా.

మొబైల్ ఫోన్ తయారీ కథ ఆది నుంచి ఆసక్తికరమే. అమెరికాలోని ప్రముఖ టెలిగ్రామ్ సంస్థ బెల్ సిస్టం సెల్యులర్ ఫోన్ వ్యవస్థ భావనను ప్రతిపాదించింది. దీన్ని రూపొందించే పనిలో పడింది. నాసా అపోలో కార్యక్రమంలో పనిచేసిన జోయల్ ఏంజెల్ అనే ఇంజనీరు దీనిపై నిశితంగా దృష్టి సారించారు. అంతకు చాలా ఏళ్ళ ముందే బెల్స్ సంస్థ కార్ ఫోన్ ను తయారు చేసింది. ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్ తో మాట్లాడే అవకాశం కలిగించింది. దీనికి చాలా పెద్ద బ్యాటరీ అవసరమయ్యేది. అందుకే కారును వాడుకున్నారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత తీర్చిదిద్ది, ఎక్కడికైనా తీసుకువెళ్లే ఫోనును రూపొందించేలా జోయల్ ప్రయత్నించారు. అదే సమయంలో మోటోరోలా సంస్థలో పనిచేస్తున్న మార్టిన్ కూపర్ కూడా, ఇలాంటి పరికరాన్ని తయారు చేసే పనిలోనే నిమగ్నమయ్యారు.

సెమీ కండక్టర్, ట్రాన్సిస్టర్, ఫిల్టర్స్, యాంటేనా నిపుణుల అందరిని కూడగట్టి, మూడు నెలల పాటు అవిశ్రాతంగా పనిచేశారు. ఎట్టకేలకు 1973 మార్చి చివరి నాటికి తాను అనుకున్నది సాధించారు. మొట్టమొదటి మొబైల్ ఫోను ను ఆవిష్కరించారు. అయితే దీని బరువంతో తెలుసా కిలో పైనే. ఇలా రూపాంతరం చెందుతూ సెల్ఫోన్ చరిత్రలో ఎన్నో విప్లమాత్మక మార్పులు తీసుకువచ్చింది. కేజీ బరువు ఉండే ఫోన్ నుంచి అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ వరకు ఎన్నో మోడల్స్ లో దర్శనమిచ్చాయి. 5 వేలు మొదలుకొని లక్షల్లో ధర పలుకుతున్న స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి. ఐఫోన్ రూపాంతరం చెందడంతో సెల్ఫోన్ భవిష్యత్తు మారిపోయింది. అందరి మదిలో శాశ్వతంగా నిలిచిపోయింది.

 

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *