మే డే విజయవంతం చేయండి

మే డే విజయవంతం చేయండి

మే డే విజయవంతం చేయండి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా రాష్ట్ర టిఎన్టియుసి ఆధ్వర్యంలో గాజువాక లంకా మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు మేడే ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మేడే రోజు సాయంత్రం గాజువాక లంకా మైదానంలో రాష్ట్ర టిఎన్టియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విచ్చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో టి ఎన్‌ టి యు సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పార్లమెంట్‌ ఇంచార్జ్‌ ఎం శ్రీ భరత్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ర్ల ప్రసాద్‌ టి ఎన్‌ టి యు సి పార్లమెంట్‌ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు లెనిన్‌ బాబు బండారు అప్పారావు నాగోతి శివాజీ వెంకన్న బాబు కోర్రాయి నాగార్జున దేవరపు అప్పలరాజు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ చిక్కాల విజయబాబు అన్నారు. ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐటీడీపీ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువనేత లోకేష్‌ బాబు సారధ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కృషి చేసి తద్వారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయడానికి మనమందరం కృషి చేయాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఐ టి డి పి ప్రతినిధులు వినీత్‌ , కోట నరేష్‌ , తరుణ్‌ ఆదిత్య , మహమ్మద్‌ గౌస్‌లు శిక్షణ ఇచ్చారు.

రాబోయే ఎన్నికల్లో టిడిప జెండా ఎగరడం ఖాయం

రాబోయే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం అన్ని విశాఖ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి, ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్‌ బుధవారం అన్నారు. పొత్తులు లేకపోయినా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాంట్లో ఎటువంటి మార్పు లేదు అధిష్టానం ఎవరితో పోతులు పెట్టుకున్న భీమిలి సిటు మాత్రం తెలుగుదేశం కేటాయించాలి భీమిలిలో తెలుగుదేశంపార్టీ చాలా బలంగా ఉంది కనుక అందరికన్ను భీమిలి మీదే అన్నారు. అటు నారా చంద్రబాబు నాయుడు యాత్రలను చూసి గాని, లోకేష్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి అప్పుడే వలసలు మొదలయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *