
మరో ఎదురు దెబ్బ
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 29
జగన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. అమరావతి రాజధానిలోని హైకోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా లైట్లు వేయాలంటూ గతంలో CRDA అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అంతా చీకటిగా ఉంటోందని, కోర్టుకు వస్తున్న వేలాది మంది చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లైట్లు వేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా CRDA అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు దిక్కార పిటిషన్ దాఖలైంది. CRDA కమిషనర్ వివేక్ యాదవ్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఉన్నతాధికారులకు హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా దున్నపోతుపై వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.