ఆర్ 5 జోన్ రగడ..హైకోర్టు తీర్పు రిజర్వ్

ఆర్ 5 జోన్ రగడ..హైకోర్టు తీర్పు రిజర్వ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉనికినే నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందా..? అందుకే ఆర్5 జోన్‌లో పేదలకు పట్టాల పేరిట నాటకాలు ఆడుతోందా..? రైతులతో ఒప్పందానికి తూట్లు పొడిచేలా.. పక్కా ప్రణాళికతో కుట్రలకు పాల్పడుతోందా..? అందులో భాగంగానే బుల్ డోజర్లతో ఎర్త్ వర్క్ పనులు చేయిస్తోందా..? అంటే రైతుల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తుండగానే.. ప్రభుత్వం ఎర్త్ వర్క్ చేయటాన్ని రాజధాని రైతులు తప్పు పడుతున్నారు. మరోవైపు.. ఆర్ 5 జోన్ ‌పై విచారణ ముగిసినన సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి. త్వరలో రాబోయే తీర్పు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఆర్ 5 జోన్ భూముల్లో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల్లో… ఇతర ప్రాంతాల పేదలకు సెంటు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వైసీపీ సర్కార్ ఆర్‌-5 జోన్‌ను ఏర్పాటు చేసి అందులో 45 వేల మంది పేదలకు సెంటు భూమి చొప్పున పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, రాజధాని అవసరాల కోసం తప్ప భూముల్ని ఇతర అవసరాలకు వాడకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ కొత్తగా ప్రభుత్వం ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసిందంటూ రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇతర ప్రాంతాల నుంచి లబ్దిదారులను అమరావతికి తీసుకు వచ్చి… రాజధాని భూముల్లో స్థలాలిస్తున్నారని వారు కోర్టుకు విన్నవించారు. అయితే పేదలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతోనే ఆర్5 జోన్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

ఆర్‌-5 జోన్‌పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు కూడా కల్పించలేదని ప్రధాన న్యాయమూర్తి ప్రశాంతకుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. వ్యక్తులకు లాభం కలిగించడం కాదు.. సంస్థలను నిర్మించండి అంటూ న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే హైకోర్టుకు సరైన రోడ్డు లేదు… సాయంత్రం లైట్‌లు కూడా వెలగడం లేదని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కోర్టు ఆదేశించినా చర్యలు చేపట్టలేదని గుర్తుచేశారు. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేసినట్లు న్యాయవాదులు తెలిపారు. సీఆర్‌డిఏ కమీషనర్‌ను కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

రాజధాని బృహత్‌ ప్రణాళిక ప్రకారం ….ఇప్పటివరకు ఆర్‌-1 , ఆర్‌-2 , ఆర్‌-3 , ఆర్‌-4 పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా… బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేసింది. కనీసం రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు, కోర్టు పరిధిలో ఉండగానే అక్కడ చదును చేసే కార్యక్రమమం మొదలుపెట్టింది. పొక్లెయినర్లతో ఐనవోలు సమీపంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు.ఆర్‌- 5 జోన్‌ ఏర్పాటు పనులను వ్యతిరేకిస్తూ ఐనవోలు సహా పలు ప్రాంతాల్లో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. హైకోర్టు పరిధిలోని అంశం పట్ల సీఆర్డీయే చర్యలు కోర్టు ధిక్కరణే అంటూ నిరసనకు దిగారు.

ప్రస్తుతం, కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. ఒక వేళ త్రిసభ్య ధర్మాసనం తీర్పు మేరకు రాజధాని అవసరాల కోసమే ఆ భూముల్ని వినియోగించాలని హైకోర్టు చెబితే…పేదలకు ఇళ్ల పంపిణీకి వేరే చోట్ల స్థలాలు చూడాల్సి ఉంటుంది. లేకపోతే అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రకటించిన కీలక నిర్మాణాల స్థలంలో సెంట్ స్థలాలు నిర్మితమవుతాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *