చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. 2014 ఎన్నికల నాటి ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ పెద్ద తప్పు చేశారని… సొంత పార్టీ నేతలే తిట్టుకుంటున్నారట. ఎన్నికలకు ముందు జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారట వైసీపీ నేతలు. మొన్నటిదాకా టీడీపీ, జనసేన కలవకుండా జగన్ అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసింది. ఇద్దరూ కలిస్తే తమకు అధికారం కల్ల అని భావించిన వైసీపీ.. ఢిల్లీ కేంద్రంగా పొత్తును చిత్తు చేసే ఎత్తుగడలు వేస్తూ వచ్చింది. పవన్ టీడీపీవైపు వెళ్లకుండా, బీజేపీ ద్వారా అడ్డుకునేందుకు స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని,175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ముందా అంటూ రెచ్చగొట్టింది. అటూ టీడీపీని పొత్తు లేకుండా వెళ్లే ధైర్యముందా అంటూ రెచ్చగొట్టింది. సోషల్ మీడియాలో కూడా ఫేక్ అకౌంట్లు సృష్టించి… టీడీపీ, జనసేన పార్టీల మధ్య చిచ్చురాజేసే ప్రయత్నం చేసింది. మరోవైపు, చంద్రబాబును అరెస్ట్ చేస్తే జనసేన టీడీపీకి దూరమైపోతుందని జగన్ భావించారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. గోడకు కొట్టిన బంతిలా వైసీపీ వేసిన ప్లాన్ బెడిసికొట్టి… ఆ పార్టీనే పుట్టి ముంచే పరిస్థితికి తీసుకొచ్చింది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదరడానికి చివరకు జగనే కారణమయ్యారు. జగనే ఈ పరిస్థితి కల్పించాడని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.

ఏ తప్పు చేయని చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇరికించిన జగన్…లోకేష్ పైనా కేసులు మోపే పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఏపీకి వచ్చిన పవన్ పైనా ప్రభుత్వం అణచివేసే ధోరణిని ప్రదర్శించింది. దీంతో, జగన్ అరాచకాలను సింగిల్ గా ఎదుర్కోలేమనే భావనకు వచ్చిన పవన్… చంద్రబాబుతో ములాఖత్ లో పొత్తు డిసైడ్ చేసుకున్నారు. అంతే, జగన్ కోటరీలో భయం మొదలైంది. టీడీపీ, జనసేన ఒక్కటవడంతో ఇక తమ పరిస్థితి ఏంటనే ఆందోళనకు వచ్చారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసి మరింత ప్రజాగ్రాహానికి గురైంది. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా విద్యార్థులు, మహిళలు బయటకు వస్తున్నారు. బాబుకు మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ… ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. విజనరీ లీడర్ పై అక్రమ కేసులు మోపడాన్ని తీవ్రం తప్పుబడుతూ.. ఆయన్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సంతకాల సేకరణ కూడా చేపడుతున్నారు. మరోవైపు, లోకేష్ జాతీయ స్థాయిలో చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని చాటిచెబుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో చంద్రబాబుకు ఏ సంబంధం లేదనే విషయాన్ని జాతీయ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పరిణామాలు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయగా… లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ద్వారా రాయలసీమ, గోదావరి జిల్లాలను చుట్టేశారు. వీరి పర్యటనలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జగన్ పాలనలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలు… ప్రతిపక్ష నేతలకు తమ సమస్యలు చెప్పుకొని విలపించారు. టీడీపీ, జనసేనలు వేర్వేరుగా పర్యటనలు చేస్తేనే, అలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే… ఇక ఇద్దరూ కలిసి జనంలోకి వెళ్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వైసీపీ వర్గాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని, గోదావరి జిల్లాలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కనివ్వనని పవన్ అనేకమార్లు చెప్పారు. ఇప్పుడు అదే జరగబోతోంది. టీడీపీ, జనసేనలు ఏకం కావడంతో… ఇక గోదావరి జిల్లాల్లో పోటీ చేయడం కూడా దండగనే భావనతో వైసీపీ నేతలు ఉన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా ఉంది.

గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది వందలు, వేయి ఓట్ల తేడాతో గెలిచిన వారు ఉన్నారు. టీడీపీ, జనసేన ఓట్లు చీలడం వల్ల వైసీపీకి ప్లస్ అయ్యింది. ఈసారి ఓట్లు చీలే ఛాన్స్ లేదు. దీనికి తోడు ఈ నాలుగేళ్లలో టీడీపీ, జనసేనల ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే 160 సీట్లు గెలుస్తామని ఇప్పటివరకు టీడీపీ అంచనా వేసింది. ఇప్పుడు జనసేన కూడా తమతో కలవడంతో… జగన్ చెబుతున్న వైనాట్ 175ను అప్లై చేస్తోంది. మొత్తంగా, టీడీపీ-జనసేనల పొత్తుతో… వైసీపీ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పైకి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా… చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తమ కొంప ముంచాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారట వైసీపీ నేతలు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *