కదం తొక్కిన టిడిపి శ్రేణులు

కదం తొక్కిన టిడిపి శ్రేణులు

విజయవాడ – మచిలీపట్నం రహదారి పసుపుమయం

మహిళలు మంగళహారతులు

చంద్రన్న కు నీరాజనం పట్టిన యువత

గూడూరు జంక్షన్ లో ఉద్రిక్తత
…….
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిర్వహించిన రోడ్ షో కు జనం పోటెత్తారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వున్న రహదారి అంతా పసుపుమయం అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కు టిడిపి శ్రేణులు కదం తొక్కాయి. అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనాలు పట్టారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. దాదాపు ప్రతి చోటా భారీ గజమాలలతో స్వాగతం పలికారు.

గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా జనసందోహం తరలి వచ్చింది. పెడన నియోజకవర్గం పరిధిలోని గూడూరు జంక్షన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు కోసం గజమాలలతో పెద్ద సంఖ్యలో జనం ఆ ప్రాంతంలో వేచి చూస్తున్నారు. అదే సమయంలో వైసీపీ శ్రేణులు సైతం మంత్రి కోసం గజమాలను సిద్ధం చేసి వేచి చూస్తున్నారు. ఇరుపక్షాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు.

రోడ్ షో కు జనసందోహం పోటెత్తటంతో నిర్ణీత సమయం కంటే గంటలకొద్దీ జాప్యంతో కార్యక్రమం కొనసాగుతుంది. అయినప్పటికీ జనసందోహం అంతకంతకూ పెరుగుతూనే వుంది. అక్కడి నుంచి చంద్రబాబు రోడ్ షో మచిలీపట్నం నగరంలో ప్రవేశించగానే ఇసుకేస్తే రాలనంతగా జన సందోహం స్వాగతం పలికింది. నగర వీధుల్లో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కు అద్భుత స్పందన లభించింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *