జనప్రవాహంలా సాగిన చంద్రన్న రోడ్ షో

జనప్రవాహంలా సాగిన చంద్రన్న రోడ్ షో

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడురోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా లో నిర్వహించిన రోడ్ షో లకు అద్భుత స్పందన లభించింది. నూజివీడులో శుక్రవారం జరిగిన రోడ్ షో జనకెరటం ఎగసిపడింది. గుడివాడ నుంచి నూజివీడు వరకు జరిగిన రోడ్ షో జనప్రవాహంలా సాగింది.

దారిపొడవునా రహదారులన్నీ పసుపు మయం అయ్యాయి. ప్రధానంగా హనుమాన్ జంక్షన్ కూడలి లో ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. ఆ కూడలిలో వున్న శ్రీహనుమాన్ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవలే గన్నవరం సంఘటన నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగు మహిళ నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు రోడ్ షో లో భారీ సంఖ్యలో వాహన శ్రేణి అనుసరించింది.

రోడ్ షోలో పాల్గొన్న జనసందోహాన్ని అదుపు చేయటం కష్టసాధ్యమయింది. మార్గమధ్యంలో పలు చోట్ల భారీ క్రేన్ ల సహాయంతో చంద్రబాబుకు గజమాలలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. యువకులు ఇనుమడించిన ఉత్సాహంతో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ రోడ్ షో లో పాల్గొన్నారు. జయహో చంద్రన్న అనే నినాదంతో గుడివాడ నుంచి నూజివీడు వరకు పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *