మోడీ నామస్మరణతో మోర్మోగిన అమెరికా

మోడీ నామస్మరణతో మోర్మోగిన అమెరికా

ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియా వన్‌ ఆఫ్‌ ది టాప్‌ మోస్ట్‌ ఫాలోవర్స్‌ ఉన్నప్రముఖుడిగా ఉన్నారీయన. మరేయితర ప్రపంచనేతలకు దక్కని గౌరవం… మోడీ ఏ దేశానికి వెళ్లినా లభిస్తుంది. తాజాగా అమెరికా పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. మూడు రోజల అమెరికా పర్యటనలో మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. వైట్‌హౌజ్‌, అమెరికన్‌ కాంగ్రెస్‌ సహా వెళ్లిన ప్రతీ చోట మోడీ స్లోగన్స్ హోరెత్తాయి.

మోడీ ప్రసంగానికి అమెరికన్ పార్లమెంట్ ఫిదా అయ్యింది. చప్పట్లు, కరతాళ ధ్వనులతో నరేంద్రమోడీని సెనెటర్లు అభినందించారు. అమెరికా పార్లమెంట్ లో మోడీ ప్రసంగించడం ఇది రెండోసారి. తనకు లభించిన అరుదైన అవకాశాన్ని ప్రధాని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. మోడీ నినాదాలతో సభ మార్మోగింది. దాదాపు గంటసేపు సాగిన ప్రసంగాన్ని సభ్యులు ఆసాంతం ఆసక్తిగా వింటూ 79 సార్లు చప్పట్లతో స్వాగతించారు. 15 సార్లు మధ్యలో అంతా లేచి నిల్చొని కరతాళ ధ్వనులతో అభినందించారు. స్పీకర్‌ మెకార్థితోపాటు సభ్యులు మోడీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి, సెల్ఫీ దిగడం విశేషం.

బైడెన్‌తో భేటీ, అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగంపై కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ వరుస ట్వీట్లు చేశారు. అమెరికా, ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి తమ భేటీ దోహదం చేసిందని ఇరు దేశాల నేతలు ప్రకటించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం, రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారం దిశగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోడీ గౌరవార్దం విందు ఇచ్చారు. ఆ విందులో భారత్ నుంచి ముకేష్ అంబాని, ఆనంద్ మహీంద్ర వంటి వారు పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ప్రధానికి ప్రత్యేకంగా విందు ఇచ్చారు.

భారత ప్రధాని మోదీ పర్యటనలో మరో అరుదైన దృశ్యం కనిపించింది. లోయర్‌ మాన్‌హట్టన్‌లోని వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ భవనంపై మువ్వన్నెల జెండా రంగుల కాంతుల్ని ప్రదర్శించారు. అంతేకాదు.. న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌పైనా ఈ దృశ్యం దర్శనమిచ్చింది. గతంలో అమెరికాను ఎంతో మంది ప్రపంచ అధినేతలు సందర్శించి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మోడికి దక్కిన ఆతిథ్యం.. అభిమానం మాత్రం నెవర్‌భిపోర్‌ అనే చెప్పాలి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *