
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరుకు టీమిండియా కసరత్తు
- NewsSports
- June 3, 2023
- No Comment
- 52
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7న ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. ఇందుకు సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టు కూర్పుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైట్ లో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ..ఫస్ట్ డౌన్ లో పుజారా… ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి, ఆ తర్వాత రహానే ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఆరో స్థానంలో హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఫాస్ట్‌బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్… పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులో శార్దూల్ ఠకూర్ కు అవకాశం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. కాగా, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా.. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది.