బేడ, బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ లు ఇస్తాం నారా లోకేష్ హామీ

బేడ, బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ లు ఇస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బేడ, బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలు బేడ/ బుడగ జంగాల కు అమలు చేస్తామన్నారు. యువగళం పాప్దయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు శివార్లలో బేడ,బుడగ జంగాల ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

బేడ, బుడగ జంగాల కు గతంలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు, కానీ 2008 లో 144 జీఓ తీసుకొచ్చి మీకు తీరని అన్యాయం చేశారని లోకేష్ చెప్పారు. మీ సమస్యలు తెలుసుకున్న తరువాత టిడిపి హయాంలో చంద్రబాబు గారు జేసీ మిశ్రా కమిషన్ వేశారని లోకేష్ ఆ ప్రతినిధులకు తెలిపారు. 13 జిల్లాలో పర్యటించిన జేసీ మిశ్రా కమిషన్ బేడ/ బుడగ జంగాల కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందని, బేడ, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే రిపోర్ట్ ను టిడిపి ప్రభుత్వం కేంద్రానికి పంపిందని లోకేష్ చెప్పారు.

ఈ లోపు బేడ, బుడగ జంగాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చంద్రబాబు ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తానని జగన్ మిమ్మలని మోసం చేశాడని విమర్శించారు. నాలుగేళ్లు బేడ/ బుడగ జంగాలను గాలికి వదిలేసి వైసిపి ప్రభుత్వం ఇంకో కమిషన్ వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు. బేడ, బుడగ జంగాలకు టిడిపి హయాంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను కూడా జగన్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. బేడ, బుడగ జంగాల పిల్లల చదువుకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *