జనాభా లో.. మనమే నెంబర్ వన్

జనాభా లో.. మనమే నెంబర్ వన్

జనాభా పెరుగుదలలో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు జనాభాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాను వెనక్కునెట్టి భారత్ మొదటి స్థానం ఆక్రమించింది. ప్రతి పదేళ్లకు మన దేశంలో జనాభా లెక్కలు జరుగుతుంటాయి. అయితే రెండేళ్ల కిందట జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారత్ జనాభా ఎంత? గడచిన పదేళ్లలో జనాభా పెరుగుదల ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుందాం….

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలను స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు 2023 పేరుతో విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం భారత్ జనాభా 142.86 కోట్లకు చేరింది. ఇదే సమయంలో చైనా జనాభా 142.57 కోట్లుగా ఉంది. అంటే మనకన్నా చైనాలో 29 లక్షల జనాభా తక్కువగా ఉందని ఐరాస వెల్లడించింది. భారత్, చైనా దేశాల తరవాత ప్రపంచ పెద్దన్న అమెరికాలో 34 కోట్ల జనాభా ఉన్నట్టు రిపోర్టులో తెలిపింది. 2023 ఫిబ్రవరి చివరి వరకు లభించిన సమాచారం ఆధారంగా ఐక్యరాజ్యసమితి ఈ రిపోర్టు ను రూపొందించింది. మొత్తం ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు భారత్, చైనాల్లోనే పోగుపడ్డారు. గడచిన కొన్నేళ్లుగా చైనాలో జనాభా వేగంగా క్షీణిస్తోంది. మూడు దశాబ్దాల కిందట చైనాలో వన్ ఫ్యామిలీ, వన్ చైల్డ్ విధానం అమలు చేయడంతో జనాభా వేగంగా అదుపులోకి వచ్చింది.

ప్రతి పదేళ్లకు భారత్ జనాభా లెక్కలను అధికారికంగా చేపడుతుంది. 2011లో భారత్ లో జనాభా లెక్కలు జరిపించారు. అప్పుడు భారత్ జనాభా 122 కోట్లుగా తేలింది. 2021లో జనాభా లెక్కలు చేయాల్సిన సమయలో కరోనా రావడంతో వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి ఇక జనాభా లెక్కలు సేకరించలేదు. అయితే 2001 నుంచి 2011 వరకు భారత్ లో జనాభా పెరుగుదల రేటు 1.7 శాతం ఉండగా,గడచిన పదేళ్లలో అది 1.2 శాతానికి పడిపోయిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక అంతర్జాతీయసంస్థలు కూడా ఏప్రిల్ నెలలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుందని రిపోర్టులు ఇచ్చాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా తన నివేదికను ప్రకటించడంతో జనాభాలో భారత్ అధికారికంగా నెంబర్ వన్ స్థానానికి చేరినట్టయింది.

భారత్ లో జనాభా వేగంగా పెరగడం పట్ల అంతర్జాతీయంగా అనేక మంది మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జనాభా పెరుగుదలను ఆందోళనకర అంశంగా చూసే బదులు, అక్కడ పురోగతి, మానవ హక్కులు, ఆకలి సూచీలను పరిశీలించాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. 2041 నాటికి భారత్ జనాభాలో పెరుగుదల నిలిచిపోతుందని, అప్పటికి మన దేశ జనాభా 165 కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2041 నుంచి భారత జనాభా కూడా క్రమంగా క్షీణిస్తుందనే అంచనాలు కొంత ఊరటనిస్తున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *