ఏపీలో అలా తెలంగాణలో ఇలా

ఏపీలో అలా తెలంగాణలో ఇలా

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తుండడంతో… దేశ, విదేశాల్లోని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెల్లువలా తరలివస్తున్నాయి. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ను వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు కలిసి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అమెరికాకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న అలియంట్ గ్రూప్, LP సంస్థ హైద‌రాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో 9 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్‌’ సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో రూ.415 కోట్లు పెట్టుబడి పెట్టింది. తాజాగా మరో రూ.497 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనుంది. తాజా విస్తరణతో మరో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజం టెక్నిప్ FMC రాష్ట్రంలో 1,250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ పెట్టుబడులతో 3500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఇదిలా ఉంటే, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరిమేసిన అమర్ రాజా బ్యాటరీ ఇండస్ట్రీ.. మహబూబ్ నగర్ జిల్లా లోని దివిటిపల్లిలో ఘనంగా భూమి పూజ జరుపుకుంది. సుమారు తొమ్మిదిన్నర వేల కోట్ల భారీ పెట్టుబడితో.. అమర్ రాజా సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ ఇండస్ట్రీని తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ప్రత్యక్షంగా సుమారు 10 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మందికి ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి దొరకనుంది. దేశంలోనే ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థల్లో ఒకటిగా అమర్ రాజా గ్రూపు గుర్తింపు పొందింది.

మరోవైపు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తైవాన్ కంపెనీ ‘ఫాక్స్‌కాన్‌’ కూడా…. ఇటీవలే హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ లో భూమిపూజ కార్యక్రమం జరుపుకుంది. ఫాక్స్‌కాన్‌ రాకతో రాష్ట్రంలో 35వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశం లభించనుంది. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా “ఫాక్స్‌కాన్” గుర్తింపు పొందింది.

తెలంగాణలో అలా ఉంటే, ఏపీలో పరిస్థితి మరోలా ఉంది. తెలంగాణకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుంటే, జగన్ రెడ్డీ ప్రభుత్వం మాత్రం ఉన్న పరిశ్రమలను తరిమికొడుతోంది. దాంతో, పెట్టుబడుదారులు ఎవరూ ఏపీవైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే అమరరాజా ఇండస్ట్రీ తెలంగాణకు తరలిపోయిందనేది జగమెరిగిన సత్యం. ఫాక్స్ కాన్ కంపెనీ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీయే.

జగన్ రెడ్డి సర్కార్ పెట్టుబడిదారులను ప్రోత్సహించని కారణంగా, పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవాటిని కూడా జగన్ ప్రభుత్వం పంపించే పని చేస్తుండడంతో…. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు. చాలా మంది వలసలు పోతున్న దుస్థితి నెలకొంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *