హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా సాగునీరు : నారా లోకేష్ హామీ

హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా సాగునీరు : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చాక ములుగుండం గ్రామానికి నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తాం. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా తాగు, సాగు నీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ములుగుండం సర్పంచ్, ఎంపిటిసిలు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా గ్రామానికి రూ.7.50 కోట్లు నిధులు ఇచ్చారు. ఎన్నికలు సమీపించడంతో గ్రామంలో పనులు మొదలు కాలేదు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2022లో కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టాడు. మంత్రి గుమ్మనూరు కాంట్రాక్టరు వద్ద రూ.1.50కోట్లు కమీషన్ తీసుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామంలో టీడీపీ గెలవడంతో పనులు నిలిపేశారు. కాంట్రాక్టరు వద్ద తీసుకున్న కమీషన్ ను కూడా మంత్రి వదిలేశాడు. మీరు అధికారంలోకి ములుగుండం గ్రామానికి రోడ్లు వేయించాలి. మా గ్రామానికి సుజలస్రవంతి కాలువ నుండి తాగు,సాగు నీరు అందించాలి అని వారు కోరారు. వారి సమస్యల పై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రోడ్ల పై కనీసం మట్టిపోసే దిక్కుకూడా లేదు. బెంజిమంత్రి గుమ్మనూరు కమీషన్లు, కబ్జాలపై ఉన్న శ్రద్ద గ్రామాల అభివృద్ధి పై లేదు అని లోకేష్ విమర్శించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *