
జగన్ కేబినెట్ నుంచి సీదిరి అప్పల రాజును పీకేస్తున్నారా..?
- Ap political StoryNewsPolitics
- March 31, 2023
- No Comment
- 26
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటీవల వైసీపీ అభ్యర్ది ఘోరంగా ఓడిపోయారు. దీంతో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై జగన్ రగలి పోతున్నారు. అయితే.. బొత్స,ధర్మాన, గడివాడ అమర్నాద్ వంటి వారిని ఏం చేయలేక.. ఆ కోపాన్ని సీదిరి అప్పలరాజుపై చూపిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యుడిని చేస్తూ.. ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు చెబుతున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీదిరి అప్పల రాజుకు ఎమర్జెన్సీ కాల్ రావటంతో.. ఆయన పదవిని జగన్ పీకేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మత్స్యకారా సామాజిక వర్గానికి చెందిన సీదీరి అప్పల రాజుపై అనేక అవినీతి ఆరోపణలు రావటం కూడా.. జగన్ కోపానికి కారణం అవుతోందని అంటున్నారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి మంత్రులంతా సమిష్టి బాధ్యత వహించాల్సి ఉండగా.. కేవలం మత్స్యాకార సామాజిక వర్గానికి చెందిన అప్పల రాజునే టార్గెట్ చేయటం ఏంటని.. వైసీపీలో ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అయితే.. మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తలపై తనకు సమాచారం లేదని సీదిరి అప్పల రాజు అంటున్నారు. ఒక వేళ మంత్రి పదవి పోయినా తనకు బాధ లేదని.. ప్రజాసేవే ముఖ్యమని ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద.. సీదిరి అప్పల రాజు మంత్రి పదవి పోతోందనే వార్త.. ఉత్తరాంధ్రతో పాటు ఏపీ వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నెల్లూరు జిల్లా వైసీపీలో కల్లోలానికి కారణమైన కాకాణి గోవర్దన్ రెడ్డిపైనా జగన్ వేటు వేస్తారని చెబుతున్నారు. ఆయన స్థానంలో నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద.. అటు శ్రీకాకుళం.. ఇటు నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు మంత్రుల పదవులకు జగన్ ఎసరు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇంకెంత మంది పేర్లు ఉంటాయో వేచి చూడాలి.