కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీదిరి అప్పలరాజు కు జగన్ క్లాస్..?

కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీదిరి అప్పలరాజు కు జగన్ క్లాస్..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను అడ్డమైన బూతులూ తిట్టిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు “సీన్ సితార్” అయ్యిందా..? కేసీఆర్ నుంచి వచ్చిన స్ట్రాంగ్ రియాక్షన్‌ తో..సీఎం జగన్ సంజాయిషీ చెప్పుకున్నారా..? నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మంత్రి అప్పలరాజుకు వార్నింగ్ ఇచ్చారా..? కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ సీఎంఓ కార్యాలయం నుంచి మీడియాకు వస్తున్న లీకులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

రాజకీయ ప్రత్యర్ధులపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం.. సభ్యత, సంస్కారం మరచి అడ్డమైన బూతులు మాట్లాడటం ఏపీలో అధికార వైసీపీ నేతలకు అలవాటు అయిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావటమే తరువాయి.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టిమరీ బూతు పురాణాలు ఆందుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టే తిట్లు వింటే.. ఎవరైనా చెవులు మూసుకోవాల్సిందే. తాము బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులమని… ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే కనీస విచక్షణ వారిలో లోపిస్తోంది. సీఎం జగన్ కళ్ళలో ఆనందం చూడటం ఒక్కటే వారి టార్గెట్‌గా కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల విధానాలపై కాకుండా.. వారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టటమే వైసీపీ నేతల సింగిల్ పాయింట్ అజెండాగా మారిపోయింది.

అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డమైన తిట్లూ తిట్టటానికి అలవాటు పడిపోయిన మంత్రుల జాబితాలో ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఉన్నారు. జగన్ క్యాబినెట్ 2వ విడత విస్తరణలో చోటు సంపాదించుకున్న అప్పలరాజు..తన మంత్రి పదవి కాపాడుకోవటానికి రాజకీయ ప్రత్యర్థులపై తరచుగా నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు‌లను అప్పలరాజు టార్గెట్ చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన రాజకీయ విమర్శలకు..ప్రతి విమర్శలు చేయాల్సింది పోయి.. తిట్ల పురాణం అందుకున్నారు. గతంలో చంద్రబాబును తిట్టినట్టే తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్.. అల్లుడు హరీష్ రావు, కుమార్తె కవితలపై నోరు పారేసుకున్నారు. కల్లు తాగిన కోతులు.. ప్రాంతీయ ఉగ్రవాదులు.. తాగుబోతులు.. అడుక్కు తినేవారంటూ.. ఇలా రాయటానికి వీలు లేని భాషలో బూతు పురాణం అందుకున్నారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత ధూషణలకు దిగారు. దీంతో.. సీదిరి అప్పలరాజు తిట్ల పంచాయితీ ఏపీ, తెలంగాణల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి కారణమైంది. జగన్ కేబినెట్‌లో ఓ మంత్రి గా ఉన్న వ్యక్తి ఈ స్థాయిలో దిగజారి అసభ్యంగా మాట్లాడటంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వైసీపీని తాము ఇప్పటికీ మిత్రపక్షంగానే భావిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నేతలు ఇలా అడ్డమైన బూతులు మాట్లాడటాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారు. దీంతో.. ఏపీ సీఎం జగన్ కు వర్తమానం పంపిన గులాబీ బాస్.. మీ వాళ్లను కంట్రోల్ చేసుకోలేక పోతే.. మా స్టైల్లో రియాక్షన్ చవిచూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ కావటంతో.. సీదిరి అప్పలరాజు కామెంట్స్‌పై ఏపీ సీఎం జగన్ సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. అప్పలరాజు వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు దూతల ద్వారా సందేశం పంపిన ఆయన.. సీదిరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణలో తమకు మిత్రపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయవద్దని కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

మొత్తం మీద.. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు.. ఏపీ సీఎం జగన్ ఆగ్రహానికి కారణం అయ్యాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని తిట్టమంటే.. తమ వాళ్లు అత్యుత్సాహంతో.. మిత్రపక్షమైన బీఆర్ఎస్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. 2014 ఎన్నికల నాటి ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *