భోగాపురంలో శంకుస్థాపన డ్రామా..! ఎన్నికల్లో మైలేజ్ కోసమేనా..?

భోగాపురంలో శంకుస్థాపన డ్రామా..! ఎన్నికల్లో మైలేజ్ కోసమేనా..?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మైలేజ్ కోసం ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే 2019 ఫిబ్రవరి 14వ తేదీన ఆ నాటీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్ పోర్టుకు.. తాజాగా మరోసారి శంకుస్థాపన చేశారు. అదే విధంగా విశాఖలో అదానీ సంస్థలు ఏర్పాటు చేస్తామని చెబుతున్న డేటా సెంటర్‌కు సైతం సీఎం జగన్ టెంకాయ కొట్టారు.

గతంలో ఇదే ప్రాజెక్టుకు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవాలు జరగాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు సీఎం జగన్ పదే పదే శంకుస్థాపనల పేరుతో హడావుడి చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా.. వచ్చే ఎన్నికల కోసం ఆయన ఆడుతున్న డ్రామా అనే అభిప్రాయం ఉత్తరాంధ్ర ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

ఇక.. 2019 కు ముందు విపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి .. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు అడుగడుగునా జగన్ రెడ్డి అడ్డు తగిలారు. రైతుల్ని రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయించారు. ఎయిర్ పోర్టు పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. తీరా.. అధికారంలోకి వచ్చాక.. రివర్స్ టెండరింగ్ పేరుతో నాలుగేళ్ళు కాలయాపన చేశారు. ఇప్పడు “భోగాపురం” ఎయిర్ పోర్టు పేరుతో హంగామా చేస్తున్నారు.

అసలు.. విశాఖ ఎయిర్ పోర్టులో సిబ్బంది ఈగలు తోలుకుంటూ కూర్చుంటే.. భోగాపురం‌లో ఎయిర్ పోర్టు నిర్మాణం ఎందుకు..? అంటూ ఆయన గతంలో ఎకసెక్కాలు ఆడారు. ఇప్పుడు అదే నోటితో.. భోగాపురం ఎయిర్ పోర్టును ఆహా.. ఓహో అంటూ పొగుడుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు మీదుగా ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. గతంలో జనాల్ని రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయించిన జగన్.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్లే కోర్టులో కేసులు పడ్డాయంటూ చెప్పటం విశేషం. గత నాలుగేళ్లుగా చేతిలో అధికారం ఉన్నప్పటికీ.. భోగాపురం వైపు కన్నెత్తి చూడని ఆయన.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో హడావుడిగా రెండవ సారి శంకుస్థాపన చేశారు. పైగా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. నోటికి ఎన్ని అబద్దాలు వస్తే.. అన్ని అబద్దాలను జగన్ రెడ్డి వల్లె వేశారు.

మరోవైపు.. విశాఖలో అదానీ డేటా సెంటర్ విషయంలోనూ జగన్ రెడ్డి డ్రామాలు కొనసాగుతన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడో టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు. అయితే.. పాత ఒప్పందాలన్నీ రద్దు చేసిన జగన్ రెడ్డి కొత్తగా అదానీతో ఒప్పందాలు చేసుకున్నారు. దాని ప్రకారం మొదటగా హిల్ నెంబర్ 4లో 130 ఎకరాలు.. ఆ తరువాత 9 ఎకరాలు, మరోసారి 60 ఎకరాలు కలిపి సుమారు 200 ఎకరాల భూములను కట్టబెట్టారు. వీటిని లీజు పద్దతిలో కాకుండా.. కారు చౌకకు అమ్మేశారు. ఎకరా 20 నుంచి 25 కోట్ల వరకు ఉన్న ఈ భూములను కేవలం ఎకరాకు కోటి రూపాయల చప్పున ఇచ్చేశారు.

దీంతో సుమారు 5 వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేవలం 200 కోట్ల రూపాయలకే అదానికి దక్కినట్టయ్యింది. మరోవైపు.. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిన అదానీ.. విశాఖలో డేటా సెంటర్ పెట్టటం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. కేవలం ఇదంతా భూముల బదలాయింపు కోసం జరుగుతున్న డ్రామా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద ఉత్తరాంధ్రలో కంపెనీలు వచ్చేస్తున్నాయని ప్రజల్ని నమ్మించటం కోసమే సీఎం జగన్ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *