సీపీఎస్ ను పూర్తిగా పక్కన పెట్టిన జగన్ సర్కార్

సీపీఎస్ ను పూర్తిగా పక్కన పెట్టిన జగన్ సర్కార్

ఏపీలో ఇప్పుడు సీపీఎస్ వర్సెస్ జీపీఎస్ గా పరిస్థితి మారింది. తాజాగా జగన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం.. ఉద్యోగుల్లో పెద్ద వివాదమే రాజుకుంది. 2019 ఎన్నికలప్పుడు.. సీపీఎస్ స్కీమ్ స్థానంలో ఓపీఎస్ పునరుద్ధరిస్తామన్న వాగ్దానాన్ని.. జగన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారు. 11వ వేతన సవరణ సంఘం పీఆర్సీ అమలు చేయలేమని.. ఉద్యోగులకు క్లారిటీగా తేల్చిచెప్పింది. ఇదే సమయంలో.. కొత్తగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది.

2023 మార్చి 30లోగా CPS రద్దు చేస్తుందని ఆశించిన ఉద్యోగులకు.. ఏప్రిల్ 25న .. కొత్తగా తెచ్చిన.. GPS ప్రతిపాదన మింగుడు పడటం లేదు. జగన్ సర్కార్ మాత్రం.. జీపీఎస్ ను అమలు చేయాలనే పట్టుదలతో .. ఆగమేఘాలపై ఏపీ కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. కొత్త స్కీమ్ .. జీపీఎస్ ప్రకారం .. పింఛను కోసం ప్రతీనెలా ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10 శాతం నిధులు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పింఛను చెల్లిస్తారు. 2004 నుంచి వివిధ శాఖల్లో చేరిన ఉద్యోగులతో పాటుగా ఉపాధ్యాయులు కలిపి దాదాపుగా 3 లక్షల మంది ఏపీకి చెందిన వారు ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్నారు. వారికి పెన్షన్ గతంలో మాదిరిగా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, వేతనంలో నెలకు 10 శాతం చొప్పున మినహాయించి.. దాని నుంచి చెల్లించడం వల్ల, పింఛను గ్యారంటీ లేదన్నది ఉద్యోగుల ప్రధాన ఆందోళన.

పాత పెన్షన్ విధానంలో జీతంలో కోత లేదు.పెన్షన్ గ్యారంటీ ఉండాలంటే ఓపీఎస్ అమలు కావాల్సిందేనన్నది ఉద్యోగ సంఘాల వాదన. మరోవైపు ప్రభుత్వ కమిటీ నిబంధనలన్నీ.. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపీఎస్ అమలుపై నాలుగేళ్లకు పైగా సమయం ఇచ్చినా.. జగన్ రెడ్డి సర్కార్.. తమను మోసం చేసిందనే.. కోపంలో ఏపీ ఉద్యోగులు ఉన్నారు. ఏపీలో సీపీఎస్ రద్దు కావాలని ఉద్యోగులు ఆశిస్తుంటే, జీపీఎస్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం చెబుతున్నది. ఎలాంటి పరిస్థితుల్లో నైనా .. జీపీఎస్ ఒప్పుకునేది లేదని.. ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఓపీఎస్‌ను అమలు చేయాలని ఉద్యోగులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జీపీఎస్ ను ఒప్పుకుంటే.. తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *