ప్రమాదంలో చంద్రబాబు భద్రత

ప్రమాదంలో చంద్రబాబు భద్రత

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు భద్రత ప్రమాదంలో పడింది. జడ్ ఫ్లస్ భద్రత ఉన్న వ్యక్తి కాన్వాయ్ ను పోలీసులు పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే వరకు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పోలీస్ అధికారులు విజయవాడలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. జడ్ ఫ్లస్ భద్రతలో భాగంగా కేంద్ర బలగాలు ఉన్నా.. ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు, సభలు, సమావేశాలు నిర్వహించే సమయంలో… అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఉంది. అయినా వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సెక్యూరిటీపై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది. విజయవాడలో చోటు చేసుకున్న ఘటన అందుకు నిదర్శనం. పోరంకిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ కానూరులో ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. జడ్ ఫ్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న వారికి టాఫ్రిక్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉంది. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే వరకు ట్రాఫిక్ నియంత్రించాల్సిన విజయవాడ పోలీసు అధికారులు చేతులెత్తేశారు. లీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అలా చేశారా అనే కోణంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడలో ప్రయాణించిన చంద్రబాబు కాన్వాయ్ మధ్యలోకి ఆటోలు, బస్సులు దూరడం… పోలీసుల, ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తుచేసింది. ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? ఏకంగా చంద్రబాబు కాన్వాయ్ లోని భద్రతా సిబ్బందికి చెందిన ఓ వాహనం… కాన్వాయ్ నుంచి తప్పిపోవడం చూస్తుంటే ప్రముఖుడి భద్రత ఎంత ప్రమాదంలో పడిందో తెలిసిపోతోంది. ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. కాన్వాయ్ నుంచి తప్పిపోయిన భద్రతా సిబ్బంది వాహనం మరలా, చంద్రబాబు కాన్వాయ్ ను చేరుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. చంద్రబాబు వెన్నంటి ఉండాల్సి భద్రతా సిబ్బంది వాహనం తప్పిపోవడం యాదృచ్ఛికమా, ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా జడ్ ఫ్లస్ భద్రత కలిగిన వారు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. వీరి భద్రతను కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఛీప్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వందల మంది రౌడీ మూకలు దాడికి దిగడం, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఘటన జరిగినా, గంట వరకు పోలీసులు కనీసం అటువైపు కూడా రాకపోవడంపై కేంద్ర నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక చంద్రబాబు ఉండే ఉండవల్లి ఇంటిపై దాడికి వేల మంది మూకలను వెంటేసుకుని వైసీపీ కీలక నేత ప్రయత్నం చేయడంపై కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. తాజాగా కుప్పం, యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనల్లో జరిగిన ఘటనలతో కేంద్రం అప్రమత్తమైంది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతను కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే సమీక్షించాయి. ఈ దిశగా ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంలో పరిశీలన జరిపాయి. రాష్ట్ర పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో మెలగడంతో, భద్రత పెంచేందుకు కేంద్రం సిద్దం అవుతోందని తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వస్తూనే చంద్రబాబుకు సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటన సమయంలోనూ సరైన రక్షణ సిబ్బందిని మోహరించడం లేదు. దీనిపై ఇప్పటికే టీడీపీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ పెద్దలు కావాలనే చంద్రబాబుకు భద్రతను తగ్గించి, ప్రజల్లో తిరగకుండా కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, ఇప్పటికే చంద్రబాబుకు కల్పిస్తున్న ఎన్. ఎస్. జీ భద్రతను రెట్టింపు చేయనున్నట్టు తెలుస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *