జగన్ రెడ్డి స్టిక్కర్ పీకితే.. టీడీపీ ఓట్లు గల్లంతేనా..?

జగన్ రెడ్డి స్టిక్కర్ పీకితే.. టీడీపీ ఓట్లు గల్లంతేనా..?

వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గెలిచేందుకు సీఎం జగన్ రెడ్డి భారీ స్కెచ్ వేశారా..? ప్రజల ఆశీస్సులతో గెలిచే అవకాశం లేకపోవడంతో కుట్రలకు తెరలేపారా..? ఓటర్ల లిస్టులో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేసే ప్లాన్ అమలు చేస్తున్నారా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఓటర్ల తొలగింపునకు వాలంటీర్ల సేవలు ఇందుకు వినియోగిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని తెలుస్తోంది. అయితే.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి గెలవడం సాధ్యం అవుతుందా?

ఏపీలో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకం పరాకాష్టకు చేరింది. సంక్షేమ పథకాలతో గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతో కొత్త ఎత్తులకు దిగుతున్నారు. ముందుగా జగనన్నే మీ భవిష్యత్తు అంటూ ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేశారు. ఎవరైతే స్టిక్కర్ పీకి వేశారో వారిని టీడీపీ సానుభూతుపరులుగా వాలంటీర్లు గుర్తిస్తున్నారు. ఆ తరవాత ఓటర్ లిస్టులో వారి ఓట్లు తొలగించే కార్యక్రమం మొదలు పెట్టారని అంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇప్పటికే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే 14 వేల ఓట్లు తొలగించారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్వయంగా ప్రకటించారు. ఇదే తంతు రాష్ట్రం మొత్తం జరుగుతోంది. లక్షలాది మంది ఉపాది, ఉద్యోగాల కోసం అనేక ప్రాంతాలకు వలసలు పోయిన తరుణంలో ప్రతి నెలా ఓటర్ లిస్టు చెక్ చేసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ఎన్నికల సమయానికి ఓటేయాలని వస్తే మాత్రం నిరాశ తప్పేలా లేదు. టీడీపీ సానుభూతిపరులను గుర్తించి వారి ఓట్లు తొలగించేందుకు వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి మరీ పని కానిచ్చేస్తున్నారు.

సీఎం జగన్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం పీకే టీం సర్వేలోనూ బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఎవరూ సంతృప్తిగా లేరు. స్వయానా సీఎం బంధువులే వైసీపీ వీడి వెళ్లిపోయేలా ఉన్నారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు. దీంతో వైసీపీని గెలిపించుకునేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు జగన్ రెడ్డి.

ఓటర్ లిస్టులో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం, ఒక వేళ వారు మరలా అప్లికేషన్ పెట్టుకున్నా, సవాలక్ష కొర్రీలు వేసి వారిని వేధించే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 14 నుంచి 20 వేల ఓట్లు తొలగించారని తెలుస్తోంది. ఈ అరాచకం ఎన్నికల ముందు వరకు సాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. ఓటర్ లిస్టులో పేరు తొలగించడం సాధ్యం కాకపోతే, ఓటరు పోలింగ్ భూత్ మార్చివేయడం చేస్తున్నారు. పోలింగ్ బూ త్ నెంబరు తెలియకపోతే ఓటు వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్నికల హడావుడిలో తమ ఓటు ఏ బూత్ లో ఉందో చెప్పే నాధుడే దొరకడం కష్టం . అందుకే టీడీపీ సానుభూతిపరుల ఓట్లే లేకుండా చేసే కుట్రను సీఎం జగన్ రెడ్డి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఓటు గల్లంతుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *