మార్గదర్శి పై సీఎం జగన్మోహన్‌ రెడ్డి కుట్ర

మార్గదర్శి పై సీఎం జగన్మోహన్‌ రెడ్డి కుట్ర

మార్గదర్శిపై సీఎం జగన్మోహన్‌ రెడ్డి కక్ష కట్టారని, ఎన్ని కుట్రలు పన్నినా మార్గదర్శిని ఈనాడు ఫిలిం సిటీని ఏమీ చేయలేరని టిడిపి యువ నాయకులు, సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి కృషి,పట్టుదలతో రామోజీరావు పైకి ఎదిగారని ఆయన జీవిత చరిత్ర నవతరానికి ఆదర్శమని తెలిపారు. రామోజీరావు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించి పెట్టుబడిదారులు, ఖాతాదారుల్లొ నమ్మకం ఏర్పరచుకున్నారని చెప్పారు. రామోజీరావుపై తప్పుడు కేసులు పెట్టి హింసించాలని జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మార్గదర్శిని ఆర్థికంగా దెబ్బతీయడం, యాజమాన్యం, మేనేజ్మెంట్‌, సిబ్బందిని బెదిరించడం, చందాదారులకు ఆందోళన గురించి చేయడమేనని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

సీఎం జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడిరది అన్నారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను పాముగా వాడుకుంటున్నారని చెప్పారు. ఈ దుర్మార్గాన్ని ప్రజల సైతం ఖండిస్తున్నారని పట్టణాలకు పరిమితమైన పత్రిక రంగానే పల్లెఈ దుర్మార్గాన్ని ప్రజల సైతం ఖండిస్తున్నారని, పట్టణాలకు పరిమితమైన పత్రికరంగాన్ని పల్లెలో ఇంటికి వెళ్లేలా పత్రిక చదివేలా చేసిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు. ఈనాడులో వాస్తవాలు రాస్తున్నందుకే జగన్మోహన్‌ రెడ్డి పగ పెంచుకుంటున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తప్పు జరిగితే ఈనాడు పత్రిక ఎత్తి చూపిందన్నారు. ఇకనైనా సీఎం జగన్మోహన్‌ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమ పాలనపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా గొండు శంకర్‌ హితవు పలికారు.60 సంవత్సరా లుగా ఖాతాదారుల నమ్మకాన్ని మార్గదర్శి చూరగొందన్నారు. 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4500 మంది ఉద్యోగులు, 16, 000 మంది ఏజెంట్లు ఉన్న గొప్ప సంస్థ మార్గదర్శని అన్నారు. ఒక్క ఖాతాదారు ఫిర్యాదు చేయకపోయినా దర్యాప్తు పేరుతో బెదిరించడం తగదు అన్నారు. వైసిపి నాయకులు వాట్సాప్‌ మెసేజ్‌ ల ద్వారా మార్గదర్శి ఈనాడు పై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *