
జనసైనికులు జాగ్రత్త.. వైసీపీ ట్రాప్ లో పడొద్దు?
- Ap political StoryNewsPolitics
- June 16, 2023
- No Comment
- 23
జనసైనికులు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో పవన్ ను నిలువరించాలనే ఎత్తుగడతో ఉన్న వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు. తద్వారా జనసేన నుంచి వచ్చే కౌంటర్లను ఏమార్చి తమ సోషల్ మాడియాలో ఓన్ చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారు. కత్తిపూడిలో పవన్ సభ ముగియగానే, జగన్ భజన బ్యాచ్ రంగంలోకి దిగి పవన్ ను నానా దుర్భషలాడారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు రివర్స్ అటాకింగ్ మొదలుపెట్టారు. ఇదే అదునుగా జనసేన నేతల తాలూకూ కొన్ని క్లిప్పింగ్స్ ను పట్టుకొని వైసీపీ పేటీఎం బ్యాచ్ తమకు అనుకూలంగా మల్చుకుంటోంది. పవన్ మాదిరే ఆయన పార్టీ నేతలవి చిల్లర చేష్టలని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకునేది అనేలా ప్రజల సింపథీ గెయిన్ చేసే కుయుక్తులు పన్నుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిస్తే, వైసీపీ ఓటమి ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే విధంగా వైసీపీ వ్యూహ రచనలు చేస్తోంది. పవన్ ప్రజల్లోకి వెళ్లిన ప్రతీసారి, ఆయన పెళ్లి వ్యవహారాన్ని తీసుకొస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. అంతేకాదు, ప్యాకేజీ స్టార్ అని,చంద్రబాబు పార్ట్ నర్ అని ఇలా రకరకాల పేర్లతో జనసేనానిని కవ్విస్తోంది. ఈ మధ్య దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ కొత్త పల్లవి అందుకుంది.
పవన్ చంద్రబాబు కలిస్తే…వైసీపీ పనైపోయినట్టేనని అంతా భావిస్తున్నారు. ఎన్నికల వేళ, జనసైనికులు ఏమాత్రం తొందరపడినా అది వైసీపీకి ఆయుధంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాగే పవన్, చంద్రబాబులను బూచిగా చూపి జగన్ ఓట్లు దండుకున్నారు. ప్రస్తుతం తన పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికుతుండడంతో మళ్లీ పవన్ ను ట్రాప్ లో పడేసి లబ్దిపొందాలనే కుట్రలు పన్నుతోంది జగన్ సర్కార్. సో, జనసైనికులు జాగ్రత్త అని పలువురు అలర్ట్ చేస్తున్నారు.