‘టైగర్ వర్సెస్ పఠాన్’ లో ఆక్వామ్యాన్ స్టార్ విలన్?

‘టైగర్ వర్సెస్ పఠాన్’ లో ఆక్వామ్యాన్ స్టార్ విలన్?

తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ లో తమ సత్త చాటుతున్న టైం లో బాలీవుడ్ కూడా ఎదో విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద సినిమాలను ప్లాన్ చేస్తున్నారు దానికోసం హాలీవుడ్ స్టార్స్ ని తమ ప్రాజెక్ట్స్ లో క్యారెక్టర్స్ గ తీసుకుంటున్నారు .. రీసెంట్ గా అనౌన్స్ చేసిన షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ ల భారీ అంచనాల చిత్రం ‘టైగర్ Vs పఠాన్’ గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించనుందని ఇంతకుముందే కథనాలొచ్చాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్టుతో కెప్టెన్ అమెరికా తరహాలో ఈ సినిమా ఉంటుందని కూడా గుసగుసలు వినిపించాయి.

ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మార్చేందుకు మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. షారుఖ్ – సల్మాన్ లను మళ్లీ ఒకే ఫ్రేమ్ లో సినిమా ఆద్యంతం కనిపించేలా చేయడమే దీని ఉద్ధేశం. అంతేకాకుండా తాజా సమాచారం ప్రకారం.. హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ మోమోవా విలన్ పాత్రను పోషించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మార్వెల్ బ్లాక్ బస్టర్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తరహాలో ఉండే ఈ చిత్రంలో విలన్ గా నటించడానికి ఆక్వామ్యాన్ స్టార్ పై చిత్రబృందం దృష్టి సారించింది. జాసన్ ఈ సినిమా కోసం ఆన్-బోర్డ్ లోకి వస్తే అది గూఢచారి చిత్రం చుట్టూ ఉన్న హైప్ ని అంచనాలను మరింత పెంచుతుంది.

నిజానికి షారుఖ్ ఖాన్ తో జాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరు నటులు రియాద్ లో ఒక ఈవెంట్ కోసం కలుసుకున్నారు. రెండు రోజుల సదస్సులో వారు జాకీ చాన్ – జీన్-క్లాడ్ వాన్ డామ్ లతో కలిసి ఫోటోలు దిగారు.

‘టైగర్ వర్సెస్ పఠాన్’ బాలీవుడ్లో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా మారనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందనుంది. షారుఖ్ – సల్మాన్ ఈ చిత్రంలో వారి పాత్రలకు సమానమైన పారితోషికం అందుకుంటారని కూడా తెలుస్తోంది.హృతిక్ రోషన్ వార్ 2లో టీజ్ చేసే ఒక సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దనున్నారని ఇంటర్ లింక్ కనెక్ట్ చేస్తారని కూడా గుసగుసలు ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ చిత్రం 2025 లో విడుదలవుతుందని సమాచారం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *