దళితుల గురించి మాట్లాడే అర్హత సురేష్‌కు లేదు : జవహర్‌

దళితుల గురించి మాట్లాడే అర్హత సురేష్‌కు లేదు : జవహర్‌

రాష్ట్రంలో దళితులపై దాడుల జరుగుతుంటే పట్టించుకోని మంత్రి సురేష్‌కు దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి జవహార్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఆదిమూలపు సురేష్‌ చర్యలు మాదిగ జాతికి తలవంపులు తెస్తున్నాయన్నారు. ఏనాడైనా దళితుల గురించి పోరాడారా?, రాష్ట్రంలో దళితులై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేష్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అర్దనగ్న ప్రదర్శన చేయాల్సంది తాడేపల్లి ప్యాలెస్‌ ముందని హితువు పలికారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం పోయినపుడు చొక్కా విప్పితే బావుండేదన్నారు. దుర్గి ,నెల్లూరు లిడ్‌ కాప్‌ భూములు అన్యక్రాంతం అయినప్పుడు సురేష్‌ ఎక్కడా? అని ప్రశ్నించారు. మలుపు, ముందడుగు పధకాలు కనుమరుగైనపుడు ఏమయ్యాడు, వరప్రసాద్‌ శిరోముండనపుడు సురేష్‌ ఏ కలుగులో దక్కున్నారో అని సూటిగా ప్రశ్నించారు.

మీ ప్రాంతంలో దళితులకు నీవేమి చేశావో చెప్పాలని సవాల్‌ విసిరారు. దళిత బాంధవుడు చంద్రబాబుని అనే అర్హత లేదన్నారు. డా సుధాకర్‌ మరణం, సుబ్రహ్మణ్యం మరణం నీకు కనిపించ లేదా? అని సూటిగా ప్రశ్నించారు. సురేష్‌ జాతి ద్రోహి దళితులకు చేసిందేమి లేదని, సురేష్‌ చర్యలను ప్రతి దళితుడు వ్యతిరేకించాలని ఆయన కోరారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *