
వేదికపై పడిపోయిన బైడెన్!
- NewsPolitics
- June 3, 2023
- No Comment
- 23
ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హఠాత్తుగా కిందకు ఒరిగిపోయారు. ప్రారంభోపన్యాసం చేసి కరచాలనం చేస్తూ ముందుకు సాగిన అధ్యక్షుడు హఠాత్తుగా పడిపోవడంతో అధికారులు కంగారుగా ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చారు. కొలరాడోలో గురువారం జరిగిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గ్రాడ్యుయేట్‌లతో కరచాలనం చేయడానికి ముందుకు సాగిన బైడెన్, దూరంగా వెళ్ళినప్పుడు పోడియం సమీపంలో పడిపోయారు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఎయిర్ ఫోర్స్ అధికారి ఆయన్ని పైకి లేపారు. తరువాత ఎవరి సాయం లేకుండానే బైడెన్ (80) నడిచారు. మిగిలిన వేడుకలకు నిలబడి ప్రజలను పలకరించడం కొనసాగించారు. చరిత్రలో సిట్టింగ్ ప్రెసిడెంట్‌గా అత్యంత వయోవృద్ధుడు.