ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం

గత నవంబరులో దేశవ్యాప్తంగా ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారిలో ఏపీకి చెందిన న్యాయమూర్తులు ఇద్దరున్నారు. అందులో ఒకరి బదిలీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2022 నవంబరు 24న హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజీయం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయవాదులు జస్టిస్ దేవానంద్ బదిలీ ఆపాలంటూ న్యాయవాదులు ఆందోళనలు చేయడంతోపాటు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో నిలిచిపోయింది.

తాజాగా జస్టిస్ బట్టు దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ దేవానంద్ బదిలీ వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా అనే అనుమానాలొస్తున్నాయి. ఏపీ హైకోర్టులో జస్టిస్ బట్టు దేవానంద్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో 2020 జనవరి 13వ తేదీన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బట్టు దేవానంద్..పలు సంచలన తీర్పులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన సంచలన తీర్పుల్లో అధికశాతం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినవే ఉన్నాయి. దీంతో ఆయన బదిలీ వెనుక కొందరి పెద్దల హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గడచిన రెండేళ్లలో జస్టిస్ దేవానంద్ పలు సంచలన తీర్పులు వెలువరించారు. ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దేవానంద్ బెంచ్ కు కేసు వెళితే తమకు న్యాయం జరుగుతుందని చాలా మంది బాధితులు భావించేవారు. జస్టిస్ దేవానంద్ ఇచ్చిన తీర్పులే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాజధాని అమరావతి వ్యవహారంపై..కోర్టు బయట ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తె మీ రాజధాని ఏదంటూ ఆటపట్టిస్తోందని జస్టిస్ దేవానాంద్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

ఇక పంచాయితీ, పాఠశాలల భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోర్టుకు పిలిపించి మరీ వివరణ కోరారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అప్పటి నుంచే జగన్ రెడ్డి రంగుల పిచ్చి కొంత అదుపులోకి వచ్చింది. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ నిర్బంధం వ్యవహారంలో టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటాగా స్వీకరించి విచారణ జరపడం కూడా సంచలనమైంది.

ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో బాధితులకు 41 ఏ నోటీసులు ఇవ్వకపోవడంపై పోలీసు అధికారులను తీవ్రంగా తప్పుపట్టారు. అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ను కోర్టుకు పిలిచి పోలీసు మాన్యువల్ అంటే ఏంటో వివరించాలని ప్రశ్నించడంతో డిపార్టుమెంటు పరువు పోయినంత పనైంది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై తీవ్రవ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై జస్టిస్ దేవానంద్ కఠినంగా వ్యవహరించారనే వాదన కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవహారంపై జస్టిస్ దేవానంద్ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ఆ పిటీషన్లను అప్పటికప్పుడు విచారణకు స్వీకరించి..వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించారు.

పలు కీలక కేసుల్లో జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన తీర్పులు, కేసు విచారణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికల్లోనూ ప్రముఖంగా నిలిచాయి. విశాఖలో ప్రభుత్వ భూముల వేలం వ్యవహారంలో ప్రభుత్వం దివాళా తీసిందా అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. జస్టిస్ దేవానంద్ ఇచ్చిన తీర్పులు చాలా వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో..ఆయన బదిలీ వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా అనే చర్చకు తెరలేచింది.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *