కళ్యాణ్ రామ్ అమిగోస్ సెన్సార్ పూర్తి

కళ్యాణ్ రామ్ అమిగోస్ సెన్సార్ పూర్తి

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నచిత్రం ‘అమిగోస్‌’. ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా విడుదలవుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టీమ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు సెన్సార్ టీమ్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రచారంలో భాగంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో ఎంతమంది నటులున్నా.. ఎక్కువ ప్రయోగాలు చేసింది అన్నయ్య కల్యాణ్‌రామే! ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుంది. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్‌ చేశారు. ఆయన తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్త్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత ప్రేమ, తాపత్రయం ఉంటుందా అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది. మైత్రీ మూవీస్‌ అంటే నా కుటుంబంతో సమానం. వరుసల విజయాలతో ఉన్న ఆ సంస్థ ఈ చిత్రంతో సక్సెస్‌ ట్రెండ్‌ కొనసాగాలని కోరుకుంటున్నా. అని అన్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్ర, మూడో పాత్ర మైఖేల్‌ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

Related post

సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

కర్ణాటక ఎంపీ, సీనియర్ నటి సుమలత ఇంట పెళ్లి బాజా మోగింది. సుమలత తనయుడు అభిషేక్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె…
జగన్ రెడ్డి.. పేదలకు నువ్వు కట్టిన ఇళ్లెన్నీ..?- పట్టాభి

జగన్ రెడ్డి.. పేదలకు నువ్వు కట్టిన ఇళ్లెన్నీ..?- పట్టాభి

పేదలకు నవరత్నాలు, సంక్షేమ పథకాలు అంటూ మాయమాటాలతో వంచిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గపడ్డాయని టీడీపీ జాతీయ ప్రతికార ప్రతినిధి.. పట్టాభి విమర్శించారు. ఎవరు ప్రభుత్వంలో…
సహకారం రంగంలో అతి పెద్ద రంగం డెయిరీ: ధూళిపాళ్ల

సహకారం రంగంలో అతి పెద్ద రంగం డెయిరీ: ధూళిపాళ్ల

సహకారం రంగంలో అతిపెద్ద రంగం డెయిరీ అని ధూళిపాళ్ల నరేంద్ర సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాల సహకారంతో దశాబ్దాలుగా మనుగడలో ఉన్న డెయిరీ రంగాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *