ఈ రాష్ట్రానికి నువ్వే… మా దరిద్రం : మాజీ మంత్రి కన్నా

ఈ రాష్ట్రానికి నువ్వే… మా దరిద్రం : మాజీ మంత్రి కన్నా

ప్రతి ఇంటిపై ఎగేరేది పసుపు జెండా. ఇంటిముందు ఉండేది జగనన్న దిష్టిబొమ్మ అని మాజీ మంత్రి తెలుగుదేశంపార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఈ రాష్ట్రానికి దరిద్రం శకుని అన్ని జగనన్నని చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏమి అభివృద్ధి సాధించామని నీ బొమ్మను మా ఇంటి ముందు పెట్టుకోవాలని ప్రశ్నించాలి. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వెళ్ళండి. ఇంటింటికీ వెళ్ళండి. మనం చేసిన మంచి చెప్పండి. మందు రేట్లు నాలుగు రెట్లు పెంచి. అన్నీ మన బ్రాండ్స్ అమ్ముతున్నందుకు నీ ఫోటో మా ఇంటి ముందు పెట్టాలని అడగండి. ఆర్టీసీ రేట్లు, కరెంట్ రేట్లు ఏడు సార్లు పెంచాము. మళ్ళీ అధికారంలోకి వస్తే పెంచుతాము అని మీ ఫోటో పెట్టమంటావా? దేశంలో అందరికంటే మన దగ్గరే పెట్రోలు రేట్లు ఎక్కువ అని చెప్పండి. ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినందుకా? రోడ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసే ప్రసక్తే లేదని చెబుతున్నందుకా? చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం చెత్త ముఖ్యమంత్రి మాకెందుకని గట్టిగా ప్రశ్నించండి.

అమరావతి రైతులను మోసం చేసి , రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు నీ ఫోటో మా ఇంటి ముందు పెట్టాలా. ఐటీలో బీహార్ కంటే వెనక వున్నామని గొప్పగా పెట్టాలా. గంజాయి , డ్రగ్స్ లో మనమే నంబర్ వన్ ఉండి మా పిల్లల భవిష్యత్తు వాటితోనే ముడిపడి ఉందని అందుకే నిన్ను మళ్ళీ గెలిపించాలని చెప్పండి. అప్పుల్లో మనమే నంబర్ వన్ అని చెప్పండి. దాదాపు, 7 లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టినందుకు ప్రతి ఇంటి ముందు నీ బొమ్మను అతికించాలా? అని అడగండ.దౌర్జన్యాలు, దాడుల్లో బీహార్ కంటే మనమే ముందున్నాము అని చెప్పండి. కోర్టులలో మొట్టికాయలు వేపించుకోవడంలో మనది దేశంలోనే ఎవరూ సాటి లేరని ఆ రికార్డ్ మనకే దక్కినందుకు పెట్టుకోవాలా. చెప్పిన అబద్ధాలు పదే పదే చెప్పి ప్రజల్ని మోసం చెయ్యడం లో మనకు తిరుగులేదని చెబుతున్నందుకు మళ్లీ నమ్మాలా. కేసుల కారణం గా కేంద్రం నుండి మన రాష్ట్రానికి రావలసిన అన్ని అడగకుండా కేవలం. అప్పులు తప్ప ,ఏమి అడగలేకపోతున్నందుకు మీ ఫోటోలు పెట్టాలా.

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి కి రాష్ట్రాన్ని తీసుకొచ్చి నందుకా. ప్రజలకు చార్ అణా పంచి , మనము బార్ అణా మింగటం తప్ప మనకు ఏమీ చేతకాదు అని చెప్పండి. మరొక్క సారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సాంతం నాకేస్తాం అని చెప్పండి. బాబాయి ని చంపించిన ఘనత కూడా మాదే అని చెప్పండి. అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెబుతామని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి వివరించి చెప్పండి. పైన తెలిపినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి తగ్గేదే లే. అనే ప్రతి ఇంటి ముందు నీ ఫోటోలు పెట్టాలా అని చెప్పండి అని కన్నా పిలుపునిచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *