
కరప్షన్ రెడ్డికి మద్దతుగా.. కాపు ద్రోహి ముద్రగడ
- Ap political StoryNewsPolitics
- June 24, 2023
- No Comment
- 19
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..కాకినాడ ఎమ్మెల్యే. అతని దోపిడీకి అంతేలేదు. సీఎం జగన్ బినామీగా చెబుతుంటారు. అతని కన్ను పడిందంటే…అది పేదల భూమి అయినా, ప్రభుత్వస్థలమైనా కబ్జా కావాల్సిందే. అంతేనా, అక్రమ బియ్యం వ్యాపారంతో మొదలై గంజాయి స్మగ్లింగ్ వరకు…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ద్వారంపూడి దోపిడీ బాగోతాలను… పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల ముందు ఉంచుతూ ఏకి పడేస్తున్నారు దాంతో, అధికార వైసీపీలో వణుకు మొదలైంది. కాకినాడలో డీ గ్యాంగ్ అవినీతి, అక్రమాలను… హ్యాష్ ట్యాగ్ ఏపీ సీఎం బినామీ అంటూ … డీజీపీ, కేంద్రహోంమంత్రులకు జనసేన ట్రెండింగ్ చేస్తోంది. దాంతో, ద్వారంపూడి శిబిరంలోనే కాదు, జగన్ వర్గంలో కలవరం మొదలైంది.
కాకినాడలో ఎక్కడ చూసినా ద్వారంపూడి భూ దందాలపైనే చర్చ జరుగుతోంది . కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సురేష్ నగర్ మున్సిపల్ పార్క్ లో ఉన్న… రెండెకరాల ప్రభుత్వ భూమిని ద్వారంపూడి కబ్జా పెట్టేశాడు. 1999లో అక్కడ కాంపౌండ్ వాల్ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో పార్క్ లో ఎస్సీ భవనం నిర్మించింది. టీడీపీ హయాంలో అక్కడ స్టేడియం నిర్మించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ స్థలంపై కన్నేసిన ద్వారంపూడి…. ప్రభుత్వ భూమిని ఏకంగా తన స్థలమంటూ స్వాహా చేసేందుకు స్కెచ్ వేశాడు. ఆ భూమిని కమర్షియల్ ల్యాండ్ గా మార్చి దాదాపు 130 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు . ఎమ్మెల్యే ద్వారంపూడిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ నేతలు కలెక్టర్ కు వినతిపత్రం కూడా అందజేశారు.
అంతేకాదు…కాకినాడ నుంచి అక్రమ బియ్యం రవాణా యథేశ్చగా సాగుతోంది. బియ్యం స్మగ్లింగ్ ద్వారానే ద్వారంపూడి 15 వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఇక, కాకినాడను డీ గ్యాంగ్ డ్రగ్స్ డెన్‌గా మార్చేసింది. అలాంటి ద్వారంపూడికి ముద్రగడ పద్మనాభం మద్దతు పలకడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు జాతి అభివృద్ధి కోసమే తన జీవితమని పదే పదే చెప్పే ముద్రగడ…ద్వారంపూడి లాంటి అవినీతిపరుడ్ని వెనకేసుకొస్తూ… పవన్ ను కళ్యాణ్ ను విమర్శించడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు.