కర్ణాటకలో కనిపించని ఆ నేతలు

కర్ణాటకలో కనిపించని ఆ నేతలు

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో విపక్షాలన్నీ ఏకమైనట్టేనా? ఏకమవ్వడమే కాదు ఏకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? కన్నడనాట కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మరో 8మంత్రుల చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాస్వీకారోత్సవానికి విపక్ష నేతలు తరలివచ్చి, మోడీని ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధమనే సంకేతాలు పంపించారు.

కొంతకాలంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు సన్నాహాలు జరుగుతున్నాయి. నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీల అధినేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు.ఈక్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ప్రతిపక్షాలకు కొండంత బలాన్నిచ్చింది. తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వేదికగా మల్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు సహా…తమిళనాడు, జార్ఘండ్, బీహార్ సీఎం, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన దూరంగానే ఉన్నారు. బెంగాల్ సీఎం దీదీ తాను ముందే రాలేనని చెప్పి తన ప్రతినిథిని పంపించారు. అయితే, ఢిల్లీ సీఎంఆప్ అధినేత కేజ్రీవాల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ సీఎం పినరయ్ విజయన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కాంగ్రెస్ ఆహ్వానాలు పంపకపోవడం చర్చయనీయాంశంగా మారింది.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత విపక్ష నేతల వైఖరి మారుతోంది. విపక్షాల కూటమికి సారథ్యం వహించాలనుకున్న వారంతా ఇప్పుడు స్టాండ్ మార్చుకొని…జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలుస్తామని చెబుతున్నారు.

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకే మద్దతు ఇస్తామని ఇప్పటికే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. కాగా, మమత చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.మొత్తంగా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. విపక్షాలు మరింతగా బలపడితే , సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెమటోడ్చక తప్పదనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *