కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు షురూ…

కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు షురూ…

కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడికానున్న వేళ.. కమలం ఆకర్ష్ కు చిక్కకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం హంగ్ కు ఎక్కువ అవకాశం ఉండడంతో …తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రలోభాల భయంతోఅభ్యర్థులందరినీ బెంగళూరులో ఒకే చోటుకు చేరుస్తోంది.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ల మధ్య ముక్కోణపు పోటీ జరగగా…హస్తం, కాషాయ పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే, ఎవరికీ సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు కాస్త ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ, హంగ్ తప్పదని తేలింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా…బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమకే పూర్తిస్థాయి మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏమాత్రం పరిస్థితులు తారుమారైనా…తమదైన రాజకీయం మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు మొదలుపెడుతున్నాయి.

హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతామనే ఆశతో ఉన్న జేడీఎస్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కింగ్ మేకర్ కాదు ఏకంగా కుమారస్వామి కింగ్ అవుతారని ఆ పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు తమను సంప్రదించినట్లు జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి బాంబ్ పేల్చారు. ఎవరితో కలిసి వెళ్లాలనే విషయంలో క్లారిటీతో ఉన్నామని కూడా చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పోటీపడుతున్నారు డీకే శివకుమార్. సీఎం అయిపోవాలనే ఆశతో ఉన్న డీకే..పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే తనదైన రాజకీయం మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అదే సమయంలో బీజేపీలో యడ్యూరప్ప, బొమ్మై సహా చాలా మంది నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే…అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది చూడాలి. మొత్తంగా, దేశమంతా కర్ణాటక ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *