చంద్రబాబుపై రాళ్ల దాడి వైసిపి పిరికిపంధ చర్య – టిడిపి నేత కస్తూరి

చంద్రబాబుపై రాళ్ల దాడి వైసిపి పిరికిపంధ చర్య – టిడిపి నేత కస్తూరి

ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం, ఎర్రగొండపాలెంలో ‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ పై సాక్షాత్తు విద్యాశాఖ రాష్ట్ర మంత్రి సమక్షంలోనే రాళ్ల దాడి చేయడం పిరికిపంద చర్య అని రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ కస్తూరి విశ్వనాథ నాయుడు అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతో చంద్రబాబు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయి హత్య కేసు నుండి దృష్టి మరల్చడానికి ఇటువంటి చిల్లర వేషాలని ఎద్దేవా చేశారు. దాడి ఘటనలో పోలీస్‌ వైఫల్యం తేటతెల్లమైందన్నారు. కేంద్ర బలగాలైన ఎన్‌. యస్‌. జి భద్రతాధికారులే చంద్రబాబు భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *