కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఖంగుతిన్న కేసీఆర్, జగన్

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఖంగుతిన్న కేసీఆర్, జగన్

అనుకున్నది ఒక్కటి..అయ్యింది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్టుగా మారింది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందని ఓ సీఎం కలవరపడుతుంటే.. జేడీఎస్ అడ్రస్ గల్లంతయ్యిందని మరో సీఎం తెగ బాధపడిపోతున్నారట. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? పక్క రాష్ట్రం ఫలితాలతో కేసీఆర్, జగన్ లకే సంబంధం అనేగా మీ డౌట్? అవును, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ లు ఖంగుతినడంతో… తమ సాయం అంతా బురదలో పోసిన పన్నీరుగా మారిందని ఏపీ, తెలంగాణ సీఎంలు హైరానా పడుతున్నారట. కర్ణాటకలో బీజేపీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల ఫండింగ్ చేశారనే ప్రచారం జరిగింది. అంతేకాదు, పొరుగు రాష్ట్రంలో కొన్ని సీట్లు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని కాషాయ పెద్దలకు జగన్ మాట ఇచ్చారని కూడా తెలిసింది. తీరా చూస్తే ఫలితాలు తారుమారై పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. బీజేపీ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికలతో పోలిస్తే దారుణంగా కమలం పార్టీ ఓటింగ్ షేర్ పడిపోయింది. కర్ణాటకలో తెలుగు సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటితే.. ఆ క్రెడిట్ ఖాతాలో వేసుకొని బీజేపీతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్నారట జగన్. కానీ, కాంగ్రెస్ గెలుపుతో జగన్ ఆశలన్నీ అడియాశలు అయినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక, తెలంగాణ విషయానికొస్తే సీఎం కేసీఆర్ ది మరో విచిత్ర పరిస్థితి. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామి కింగ్ మేకర్ అయితే, అది తమ ఘనతేనని చెప్పుకుని, ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారట కేసీఆర్. అయితే, జేడీఎస్ కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కావడంతో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలిననట్లైంది. కుమారస్వామి పార్టీకి ఎన్నికల్లో కేసీఆర్ నిధులు సమకూర్చారనే ప్రచారం ఉంది. కర్ణాటకలో తెలుగు సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో పరోక్షంగా జేడీఎస్ కు మద్దతిచ్చే కార్యక్రమాలు చేశారట. కానీ, కేసీఆర్ వ్యూహాలేవీ వర్కవుట్ కాలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ కు..మొదట అండగా నిలిచింది కర్ణాటక కుమారస్వామినే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. కానీ, ఎందుకో ప్రచారానికి దూరంగా ఉన్నారు. సీన్ కట్ చేస్తే జేడీఎస్ ను గెలిపించేందుకు కేసీఆర్ తెరవెనక ప్రయత్నాలు సాగించారు. కానీ, అవన్నీ బెడిసికొట్టాయి. కుమారస్వామిని నమ్ముకొని ఢిల్లీలో హడావుడి చేయాలన్న కేసీఆర్ కు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు మింగుడుపడకుండా చేశాయి. 2018తో పోల్చుకుంటే సగానికి సగం సీట్లను జేడీఎస్ పార్టీ కోల్పోయింది. జేడీఎస్ పార్టీకి ఇంత తక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు ఊహించలేకపోయారు.

మరోవైపు, ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందనే ఆగ్రహంతో తెలుగు ప్రజలు ఉన్నట్లు… కర్ణాటకలోని అసెంబ్లీ ఫలితాలు తేటతెల్లం చేశాయి. కర్ణాటకలోని తెలుగు సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్న తెలుగు ప్రజలు… ఏపీలో ఆ పార్టీతో అంటకాగుతున్న జగన్ పై కూడా మండిపోతున్నారని తాజా ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి ఏపీలో తన సీటుకు ఎసరు తెచ్చేలా ఉందనే ఆందోళనలో జగన్ రెడ్డి ఉన్నారట. మొత్తంగా, కర్ణాటకలో వచ్చిన అనూహ్య ఫలితాలు… వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ఎఫెక్ట్ చూపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *