మోడీని టార్గెట్ చేస్తూ ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్

మోడీని టార్గెట్ చేస్తూ ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నయా రాజకీయం నడుస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతుండడంతో , కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని మరింతగా కలవరపెట్టేలా, కంపెనీ టేకోవర్ కు బిడ్డింగ్ పిలిచారంటూ కొందరు తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా… RINL బ్లాస్ట్ ఫర్నేస్ 3 కోసం ఈవోఐ ప్రకటన చేసంది. అయితే, తెలంగాణ సర్కార్ సింగరేణి ద్వారా ఏకంగా స్టీల్ ప్లాంట్ టేకోవర్ చేస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 పునరుద్ధరణ కోసం మాత్రమే బయటి సంస్థల నుంచిటెండర్లు పిలిచారని, మొత్తం ప్లాంటు విక్రయం కోసం కాదని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది.అయితే, కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో, ముందస్తు ప్లాన్ లో భాగంగా ముడి పదార్థాల సరఫరాకు అడ్డంకులు మొదలయ్యాయి. బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందకుండా పోయింది. స్టీల్‌ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్‌ ఫర్నే‌సలు ఉండగా… బీఎఫ్‌3 ఏడాదిన్నర కిందట మూత పడింది. దీంతో 25 లక్షల టన్నుల ఉత్పత్తి ఆగిపోయి నష్టాలు అధికమయ్యాయి. ఇలాగే ప్లాంట్ మూతబడితే స్టీల్‌ప్లాంట్‌ కొనేందుకు ఎవరూ ముందుకు రారనే ఉద్దేశంతో, బ్లాస్ ఫర్ననేస్-3ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. బీఎఫ్-3ని నడపడానికి అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేసి, అందులో ఉత్పత్తి అయ్యే స్టీల్‌ని తీసుకునేలా ఎవరైనా ముందుకు రావచ్చునంటూ యాజమాన్యం ఇటీవల ఈవోఐ ప్రకటన ఇచ్చింది. బిడ్లు వేసేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే, 20 రోజుల్లో ఏడు సంస్థలు ప్లాంటును సందర్శించగా, అవన్నీ కూడా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర కలిగినవేనని తెలుస్తోంది. అయితే, తాజాగా సింగరేణి డైరెక్టర్లు స్టీల్ ప్లాంట్ ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మికసంఘాలు తెలంగాణలోని రాజకీయ పార్టీలను కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో గళమెత్తాలని కోరాయి.వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతం గురించి ఆలోచన చేస్తున్న కేసీఆర్ కు, కార్మికుల రాకతో బ్రహ్మాస్తం దొరికినట్లు అయ్యింది. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనే వీల్లేకపోవడంతో, తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థ ను రంగంలోకి దించారు గులాబీబాస్. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్‌ను నేరుగా కొనుగోలు చేయాలని, ఇందుకు బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈవోఐలో పాల్గొనడం ద్వారా బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు, రాజకీయంగానూ మైలేజ్ సాధించేలా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, దీనిపై కొందరు రాజకీయం చేస్తున్నారు. ఏకంగా స్టీల్ ప్లాంట్ నే తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తుండగా, కార్మికులు కొట్టిపారేస్తున్నారు.

ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల లేఖ కూడా రాశారు. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసినా దేశంలో బీఆర్ఎస్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వస్తే..మళ్లీ ప్రభుత్వపరం చేస్తామంటూ గతంలో కేసీఆర్ పలు బహిరంగ సభలలో ఓపెన్‌గా చెప్పారు. అంతేకాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల బీఆర్ఎస్…విశాఖలో బీచ్ రోడ్డు నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మహా ధర్నా కూడా చేపట్టింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. తాజాగా, కేసీఆర్ స్టీల్ ప్లాంట్ బీఎఫ్-3 బిడ్డింగ్ లో పాల్గొనాలని తీసుకున్న డెసిషన్ హాట్ టాపిక్ గా మారింది.

సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో, బిడ్డింగ్‌ నిర్ణయంలో రాష్ట్ర సర్కారు నిర్ణయమే ఫైనలా? లేక ?కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.

మొత్తంగా, స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉక్కు పేరుతో ఏపీ ప్రజల్ని మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతుండగా.. జగన్ సర్కార్ డైలమాలో పడింది. ఏది ఏమైనా ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలనుకున్న బీజేపీ ఎత్తును చిత్తు చేసేలా, ఏపీలో పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేసుకునే పనిలో గులాబీ బాస్ ఉన్నారు. అయితే, మున్ముందు ప్రణాళిక, కార్యచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *