నా పెళ్లి గురించి మీకెందుకు?

నా పెళ్లి గురించి మీకెందుకు?

గత కొద్దిరోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు సంబంధించి… హీరోయిన్ కీర్తిసురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని…పెళ్లి ఫిక్స్ అయితే అందరికీ తానే స్వయంగా చెబుతానంటూ చిర్రుబుర్రులాడింది అమ్మడు. ఇటీవలే దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ…. ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం కీర్తిసురేష్ చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో చేస్తోంది ఈ చిన్నది. ఉదయనిధి స్టాలిన్ తో మామన్నన్, జయం రవితో సైరన్ సహా పలు సినిమాల్లో కనువిందు చేయనుంది.

రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం అందంతోనే కాదు నటనతోనూ కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమా కీర్తి క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.

కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి.. ఈ మధ్య అందాలతో రెచ్చిపోతోంది. నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారిపాట సినిమాలో కీర్తిసురేష్ గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే, ఇటీవల దసరా సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది.

ఇదిలా ఉంటే కీర్తిసురేష్ పెళ్ళికి సంబంధించిన వార్తలు ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కీర్తిసురేష్ పెళ్లి విషయంపై ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇదే విషయం పై కీర్తిసురేష్ కూడా స్పందించింది. తన పెళ్లి పై మీకెందుకు అంత ఆసక్తి.? ప్రతిసారి ప్రెస్‌ మీట్‌లో అడగాల్సిన పని లేదంటూ ఆ ముద్దుగుమ్మ కాసింత కోపాన్ని వెలిబుచ్చింది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *